
ఈ ఏడాది విజేతల జాబితాలో అంతర్జాతీయ యాప్‌లతో పాటు భారతీయ డెవలపర్లు రూపొందించిన యాప్‌లు కూడా చోటు దక్కించుకున్నాయి. Adobe Premiere బెస్ట్ యాప్ ఆఫ్ 2026గా నిలవగా, Arknights: Endfield బెస్ట్ గేమ్ అవార్డును గెలుచుకుంది. వినియోగదారుల సృజనాత్మకతను పెంచడంతో పాటు రోజువారీ పనులను సులభతరం చేసే యాప్‌లకు ఈసారి ప్రాధాన్యత లభించింది. అలాగే విభిన్న గేమింగ్ అనుభవాలను అందించే గేమ్‌లను కూడా గూగుల్ ఎంపిక చేసింది.
Google Play Best of 2026 జాబితాలో Adobe Premiere బెస్ట్ యాప్‌గా నిలిచింది. మొబైల్‌లోనే మల్టీట్రాక్ టైమ్‌లైన్, వీడియో ఎడిటింగ్, స్పీచ్ ఎన్‌హాన్స్‌మెంట్ వంటి టూల్స్‌తో వీడియోలను రూపొందించుకునే అవకాశం కల్పిస్తోంది. Creative Expression విభాగంలో ibis Paint X అవార్డు గెలుచుకుంది. ఇలస్ట్రేషన్స్, యానిమేషన్ల తయారీకి ఇందులో పలు టూల్స్ ఉన్నాయి. Innovative Appగా Wispr Flow ఎంపికైంది. వాయిస్ ద్వారా చెప్పిన మాటలను తప్పులు, అనవసర పదాలు తొలగించి చక్కని టెక్స్ట్‌గా మార్చుతుంది. హిందీ, హింగ్లిష్ సహా పలు భాషలకు మద్దతు ఇస్తుంది.
భారతీయ యాప్‌లలో Pronto బెస్ట్ ప్రొడక్టివిటీ పార్ట్‌నర్‌గా నిలిచింది. ఇంటి శుభ్రత, లాండ్రీ వంటి పనులకు సహాయం బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. Baby Development & Milestones తల్లిదండ్రులకు పిల్లల ఎదుగుదల, అభివృద్ధి దశలను ట్రాక్ చేయడంలో ఉపయోగపడుతుంది. Zolio: Daily Journal & Diary వ్యక్తిగత విషయాలను డైరీ రూపంలో నమోదు చేసుకునేందుకు సహాయపడుతుంది. Pocket FM బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ యాప్‌గా, FanCode స్పోర్ట్స్ అభిమానులకు ఉత్తమ యాప్‌గా ఎంపికయ్యాయి. Strava బెస్ట్ క్రాస్ డివైస్ యాప్‌గా, Pocket Casts బెస్ట్ ఫర్ వాచెస్ విభాగంలో అవార్డులు గెలుచుకున్నాయి.
గేమింగ్ విభాగంలో Arknights: Endfield బెస్ట్ గేమ్‌తో పాటు బెస్ట్ స్టోరీ అవార్డును కూడా గెలుచుకుంది. ఇందులో Talos-II అనే విస్తారమైన ప్రపంచంలో అన్వేషణ, వనరుల సేకరణ, పారిశ్రామిక నిర్మాణం వంటి అంశాలు ఉంటాయి. Monument Valley 3 బెస్ట్ ఇండీ గేమ్‌గా నిలిచింది. Pokémon Champions బెస్ట్ మల్టీప్లేయర్ గేమ్‌గా, Astro Arena: 3vs3 MOBA బెస్ట్ పిక్ అప్ అండ్ ప్లే గేమ్‌గా ఎంపికయ్యాయి.
భారత్‌లో రూపొందిన ScarFall 2.0 బెస్ట్ మేడ్ ఇన్ ఇండియా గేమ్ అవార్డును గెలుచుకుంది. ఇందులో ముంబై నగర ప్రాంతాలు, లోకల్ రైళ్లు వంటి భారతీయ నేపథ్యాలను గేమింగ్‌లో భాగం చేశారు. eFootball బెస్ట్ ఆన్‌గోయింగ్ గేమ్‌గా నిలిచింది. Deep Rock Galactic: Survivor బెస్ట్ క్రాస్ డివైస్ గేమ్ అవార్డును సొంతం చేసుకుంది. Androidతో పాటు PCలోనూ ఆడుకునే అవకాశం ఉండటం దీని ప్రత్యేకత. ఇలా 2026లో యాప్‌లు, గేమ్స్ విభాగాల్లో సృజనాత్మకత, వినియోగదారుల అవసరాలు, కొత్త టెక్నాలజీకి ప్రాధాన్యత లభించింది.