Reliance Jio: జియో యూజర్లకు భారీ గుడ్‌న్యూస్.. రూ.35 వేల విలువ చేసే సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ..

తమ కస్టమర్లకు జియో భారీ శుభవార్త అందించింది. గూగుల్ జెమినీ 3 ప్రో వెర్షన్‌ను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. 18 నెలల పాటు ఈ అవకాశాన్ని జియో యూజర్లు ఉపయోగించుకోవచ్చు. ఎయిర్‌టెల్‌కుగా పోటాగా జియో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టెలికాం వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Reliance Jio: జియో యూజర్లకు భారీ గుడ్‌న్యూస్.. రూ.35 వేల విలువ చేసే సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ..
Google Gemini 3

Updated on: Nov 20, 2025 | 11:27 AM

Google Gemini Pro: టెక్నాలజీ ఏది ట్రెండింగ్‌లో ఉంటే దానిని అందిపుచ్చుకోవడం అన్నీ కంపెనీలకు అలవాటే. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఊహించని రీతిలో అద్బుతాలు సృష్టిస్తున్న క్రమంలో ఆ సేవలను ప్రజలకు అందించి కస్టమర్లను పెంచుకోవడంపై అన్ని కంపెనీలు ఫోకస్ పెట్టాయి. ఏఐ సంస్థలు పోటాపోటీగా కొత్త టూల్స్‌ను తీసుకొస్తుండగా.. స్మార్ట్‌ఫోన్, టెలికాం కంపెనీలు వాటిని యూజర్లకు అందిస్తూ తమ సేల్స్‌ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్ కంపెనీ పర్‌ప్లెక్సిటీ సేవలను ఏడాది పాటు ఉచితంగా అందిస్తుండగా.. తాజాగా జియో కూడా అదే బాటలో నడుస్తోంది.

తాజాగా గూగుల్ జెమినీ 3 ఏఐ మోడల్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ మోడల్‌లో అత్యాధునిక ఫీచర్లు అందిస్తోంది. ఖచ్చితమైన సమాచారం ఇవ్వడంతో పాటు మనిషిలా తెలివితో ఆలోచించి సమాధానాలు ఇస్తోంది. దీంతో ఈ కొత్త ఏఐ మోడల్ పట్ల యూజర్లు ఆసక్తి చూపిస్తుండగా.. ఈ సేవలను ఉచితంగా అందించాలని జియో నిర్ణయించింది. జియో యూజర్లు 18 నెలల పాటు జెమినీ 3 మోడల్‌ను ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. నవంబర్ 19 నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. 5జీ స్మార్ట్‌ఫోన్ యూజర్లందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని జియో తన ప్రకటనలో తెలిపింది. సాధారణంగా ఈ ప్లాన్ తసుకోవాలంటే రూ.35 వేల ఖర్చు అవుతుంది.

కానీ ఇప్పుడు రూ.349తో రీఛార్జ్ చేసుకునేవారికి గూగుల్ జెమినీ 3 సబ్‌స్క్రిప్షన్‌ను జియో ఉచితంగా అందిస్తోంది. మై జియో యాప్‌లోకి వెళ్లి క్లెయిమ్ నౌ ఆప్షన్‌ను క్లిక్ చేసి ఈ ప్లాన్‌ సేవలను యాక్టివేట్ చేసుకోవచ్చు. జియో వాడే విద్యార్థులు, ఉద్యోగులకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి