మీ ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో WhatsApp వెబ్ వాడుతున్నారా?.. ఇది తెలుసుకోండి!

చాలా మందికి ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో WhatsApp వెబ్ వాడటం అలవాటు. కానీ ఇలా చేయడం మంచిది కాదని భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ చెబుతోంది. దీని వలన ఉద్యోగి వ్యక్తిగత డేటా కంపెనీ చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అయినా కూడా మీరు ఆఫీస్ ల్యాప్‌టాప్‌లోనే వాట్సాప్ ఉపయోగించాలనుకుంటే.. ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.

మీ ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో WhatsApp వెబ్ వాడుతున్నారా?.. ఇది తెలుసుకోండి!
Whatsapp Web Security Alert

Edited By: Ram Naramaneni

Updated on: Aug 15, 2025 | 5:58 PM

ఒక వేల మీరు మీ ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో వాట్సాప్ వెబ్‌ను ఉపయోగిస్తుంటే , ఈ అలవాటును మార్చుకోండి. ఎందుకంటే దీని వలన ఉద్యోగి వ్యక్తిగత డేటా కంపెనీ చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ హెచ్చరిస్తోంది. అందుకోసం ఆఫీసు ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించడం మానేయాలని ప్రజలను కోరింది. ఆఫీస్‌ ల్యాప్‌టాప్‌లో వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించడం వల్ల మీ ల్యాప్‌టాప్ యాక్సెస్‌ ఆఫీస్‌ యాజమాన్యం, ఆ కంపెనీ ఐటీ బృందం చేతుల్లోకి వెలుతుంది. దీని వల్ల వారు మీ ప్రైవేట్ సంభాషణలు, వ్యక్తిగత ఫైల్‌లను యాక్సెస్ చేయవచ్చని ప్రభుత్వం నొక్కి చెబుతోంది. ఇది మాల్వేర్, స్క్రీన్-మానిటరింగ్ సాఫ్ట్‌వేర్ లేదా బ్రౌజర్ హైజాకింగ్‌తో సహా అనేక విధాలుగా జరగవచ్చుని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అవేర్‌నెస్ టీమ్ ప్రకారం.. అనేక సంస్థలు ఇప్పుడు వాట్సాప్ వెబ్‌ను భద్రతా ప్రమాదంగా భావిస్తున్నాయి. ఇది మాల్వేర్, ఫిషింగ్ దాడులకు మూలంగా మారవచ్చని చెబుతోంది. అంతే కాదు ఉద్యోగులు ఆఫీస్ వై-ఫైని ఉపయోగించడం వల్ల కూడా కంపెనీలకు ఉద్యోగుల ఫోన్‌లను యాక్సెస్‌ చేసే అవకాశం లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఇది మీ ప్రైవేట్ డేటాను ప్రమాదంలో పడేస్తుందని పేర్కొంది. అయితే మనం ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు పాటించమంటోంది.

ఇలా జాగ్రత్తలు తీసుకోండి.

  • మీరు తప్పనిసరిగా వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించాల్సి వస్తే, ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మీకు సూచించింది
  • వాట్సాప్ వెబ్ ఉపయోగించిన తర్వాత, లాగ్ అవుట్ చేయడం గుర్తుంచుకోండి.
  • తెలియని వ్యక్తుల నుండి లింక్‌లపై క్లిక్ చేసేటప్పుడు లేదా అటాచ్‌మెంట్‌లను తెరిచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

మరిన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.