Chandrayaan 3: చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్.. సంబరాల్లో శాస్త్రవేత్తలు..

|

Jul 14, 2023 | 3:02 PM

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన చంద్రయాన్-3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. మొదటి దశ విజయవంతం అయ్యింది.

Chandrayaan 3: చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్.. సంబరాల్లో శాస్త్రవేత్తలు..
Isro
Follow us on

జాబిల్లి రహస్యాలను మానవాళికి అందించే అపురూప కార్యం విజయవంతమయ్యింది. ఒకటీ రెండూ కాదు.. నాలుగేళ్ళ ఇస్రో శాస్త్రవేత్తల అవిశ్రాంత కృషి తొలిదశ విజయవంతంగా పూర్తయ్యింది. మానవ మేథస్సుకు మచ్చుతునకలాంటి చంద్రయాన్‌-3 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్ళింది. శాస్త్రవేత్తల కరతాళ ధ్వనుల మధ్య ఆనందం అంబరాన్నంటింది. నింగికేగిన చంద్రయాన్‌ – 3 యావత్‌ భారతాన్ని నిబిడాశ్చర్యంలో ముంచేస్తూ భారత కీర్తి పతాకను దశదిశలా చాటింది. మూడు దశలు పూర్తిచేసుకొని.. విజయవంతంగా నింగిలోకి దూసుకెళుతోంది. జాబిల్లిలోని రహస్య జాడలు కనుక్కునేందుకు చంద్రాయన్‌ -3 నింగిలోకి దూసుకెళుతోన్న దృశ్యాలు యావత్‌ భారతావనిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచేశాయి.

రాకెట్ మొదటి దశను దాటి రెండో దశలోకి ప్రవేశించింది. రాకెట్ ప్రయోగాన్ని 3 దశల్లో నిర్వహిస్తుండగా.. చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్‌ను ఎల్‌వీఎం రాకెట్ నింగిలోకి మోసుకెళ్తుంది. 40 రోజుల పాటు సుదీర్ఘ ప్రయాణం సాగనుంది. సుమారు 3.84 లక్షల కిలోమీటర్లు ప్రయాణించనుంది. భూకక్ష్యలో 24 రోజులపాటు భ్రమణం చెందుతుంది. ఆగస్టు 23వ తేదీ లేదా 24వ తేదీన జాబిల్లిపైకి ల్యాండర్ చేరుతుంది.

విజయవంతంగా భూకక్ష్యలోకి రాకెట్..

చంద్రయాన్-3 రాకెట్ విజయవంతంగా భూకక్ష్యలోకి చేరింది. 24 రోజుల పాటు భూకక్ష్యలో భ్రమణం చెంది.. ఆ తరువాత చంద్రునివైపు పయనించనుంది. చంద్రుడి దక్షిణ ధృవంలో ఈ చంద్రయాన్-3 ల్యాండ్ అవనుంది. కాగా, చంద్రయాన్ -3 ప్రయోగం సక్సెస్ అవడంతో ఇస్త్రో శాస్త్రవేత్తలు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.

మరిన్ని సైన్స్&టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..