
సృష్టిలో అత్యంత అందమైన పేరు అమ్మ. ఆమె చూపించే ప్రేమకు అవధులు లేవు. వర్ణించడానికి మాటలు సరిపోవు. పిల్లలకు నడక నేర్పి, విద్యా బుద్ధులు నేర్పించి, ప్రతి సందర్భంలో వెన్నుతట్టి ప్రోత్సహించి, మంచిచెడులను వివరించి, సమాజంలో ఉన్నత వ్యక్తిగా తీర్చదిద్దడంలో ఆమె పాత్ర ప్రశంసనీయం. మన అభివృద్ధిని, ఎదుగుదలను కొరుకునే అమ్మ ప్రేమ నిస్వార్థమైంది. ఆమె రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిది. అలాంటి మాతృమూర్తుల గొప్పతనాన్ని తెలియజేసేందుకు మదర్స్ డే ఓ అవకాశం. మీ ప్రియమైన అమ్మకు బహుమతులు ఇచ్చి ఆనందపర్చడానికి ఇదే మంచి సమయం. దీనికి తోడు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ కూడా మనకు అందుబాటులో ఉంది. దీనిలో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్లు, ఇయర్‌బడ్‌లతో సహా అనేక రకాల టెక్ ఉత్పత్తులపై అద్భుతమైన డీల్‌లు ఉన్నాయి. మీకు అనువైన బడ్జెట్ లో అందుబాటులో ధరలో లభించే ఈ వస్తువులను అమ్మకు అందించి ఆనంద పరుద్దాం.
ఈ ఫోన్ లోని 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్ డీఆర్ డిస్‌ప్లేతో వీడియోలను చాలా స్పష్టంగా చూడవచ్చు. 12 ఎంపీ వైడ్, అల్ట్రా వైడ్ కెమెరాలతో సహా డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఏర్పాటు చేశారు. 12 మెగాపిక్సెల్ ట్రూ డెప్త్ ఫ్రంట్ కెమెరా నైట్ మోడ్ ఫొటోగ్రఫీతో పాటు 4కె డాల్బీ విజన్ హెచ్ డీఆర్ లో వీడియోలను రికార్డ్ చేయగలదు. ఏ15 బయోనిక్ చిప్ కారణంగా పనితీరు సమర్థవంతంగా ఉంటుంది.
ఈ మినీ మ్యూజిక్ ప్లేయర్ స్పీకర్ లో 351 ఎవర్‌గ్రీన్ హిందీ పాటలను లోడ్ చేశారు. సంగీతాన్ని ఇష్టపడేవారికి ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఈ పోర్టబుల్ స్పీకర్ లో యూఎస్ బీ, బ్లూటూత్ కనెక్టివిటీలు ఉన్నాయి. మీకు ఇష్టమైన పాటలను కూడా ఇందులో వినవచ్చు. అలాగే ఎఫ్ఎం/ఏఎం రేడియోకు సపోర్టు చేస్తుంది. దీని ద్వారా మీరు వ్యక్తిగతంగా పాటలను వినవచ్చు. లేకపోతే బయట స్పీకర్లకు కనెక్ట్ చేయడానికి 3.5 ఎంఎం ఆడియో జాక్ అందుబాటులో ఉంది. ఫోన్లు, ఇతర పరికరాలను కనెక్ట్ చేయడానికి ఆక్స్ ఇన్ పోర్ట్ సౌకర్యం ఉంది. దీనిలోని బ్యాటరీ సుమారు ఐదు గంటల పాటు పాటలను వినే అవకాశం ఇస్తుంది. ఏదైనా ఆండ్రాయిడ్ చార్జర్ ను ఉపయోగించి ఛార్జింగ్ చేసుకోవచ్చు.
ఈ స్మార్ట్ వాచ్ 1.78 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో ఆకట్టుకుంటుంది. బ్లూటూత్ కాలింగ్‌తో సహా సాధారణ వినియోగంతో రెండు రోజుల వరకూ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. బ్లూటూత్ కాలింగ్, ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే లేకపోతే ఐదు రోజుల వరకూ పనిచేస్తుంది. ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల నుంచి నోటిఫికేషన్లను సపోర్ట్ చేస్తుంది. దీనిలో ఎస్పీవోటు,హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్, స్పోర్ట్స్ ట్రాకింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
ఈ స్మార్ట్ స్పీకర్ వాయిస్ నియంత్రణ కోసం తయారు చేశారు. దీనిలోని వర్చువల్ అసిస్టెంట్ అయిన అలెక్సాను ఉపయోగించి దూరం నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంగ్లిష్, హిందీ రెండింటిలోనూ కమ్యూనికేట్ చేయగలదు. ఇది కాలక్రమేణా కొత్త ఫీచర్లతో ఆటోమేటిక్ అప్‌డేట్ చేసుకోగలదు. ఎకో డాట్ 4వ జెన్ స్పీకర్ గుండ్రని ఆకారంలో ఉంటుంది. ఇది టైం, బయట టెంపరేచర్ ను చూపించే ఎల్ ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీనిలోని ఆలారాన్ని ఆపటానికి స్పీకర్ పైభాగాన్ని నొక్కవచ్చు. చుట్టుపక్కల ఉన్న కాంతి స్థాయిని బట్టి డిస్‌ప్లే ఆటోమెటిక్ గా సెట్ అవుతుంది..
ఈ ఇయర్ బడ్స్ సుమారు 120 గంటల ప్లేబ్యాక్ సమయం అందిస్తాయి, ఒక్కో ఛార్జ్‌కి 24 గంటల ప్లేబ్యాక్ ఉంటుంది. స్పష్టమైన వాయిస్ కాల్‌ల కోసం ప్రత్యేకంగా వీటిని రూపొందించారు. పక్క నుంచి వచ్చే శబ్దాలను నిరోధించడానికి, కాల్ స్పష్టతను మెరుగుపరచడానికి ఈఎన్ఎక్స్ టెక్నాలజీ కలిగిన నాలుగు మైక్రోఫోన్లను దీనిలో అమర్చారు. గేమింగ్ సెషన్‌లలో లాగ్‌ను తగ్గించడానికి 60 ఎంఎస్‌ల తక్కువ జాప్యాన్ని అందించే బీస్ట్ మోడ్ ఫీచర్ ఉంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.2 టెక్నాలజీని ఉపయోగించారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..