స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తున్న బోల్ట్‌..! ఏస్‌ 5జీ, ఏవో మోడళ్ల ప్రత్యేకతలివే

Boltt Smartphone.. ఇప్పటివరకు స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లతో విపరీతమైన ఆదరణ దక్కించుకున్న ప్రముఖ గ్యాడ్జెట్ బ్రాండ్ Boltt.. సరికొత్త అడుగు వేస్తూ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. తమ తొలి స్మార్ట్‌ఫోన్ల శ్రేణిలో భాగంగా Ace 5G, Evo అనే రెండు శక్తివంతమైన కొత్త మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు పూర్తి చేసింది. రాబోయే ఆగస్టు 25న మధ్యాహ్నం 12 గంటలకు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కాఫ్ట్ వేదికగా ఈ స్మార్ట్‌ఫోన్‌లు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు మోడళ్లలో ఏస్ 5జీ కొంత ప్రీమియం ఫీచర్లతో వస్తుండగా.. ఎవో మోడల్ బడ్జెట్ శ్రేణి వినియోగదారులను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తోంది.

స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తున్న బోల్ట్‌..! ఏస్‌ 5జీ, ఏవో మోడళ్ల ప్రత్యేకతలివే
Boltt Ace 5g And Evo

Updated on: Aug 15, 2026 | 9:00 PM

5జీ మోడల్ ఆకర్షణీయమైన క్లాసీ రెడ్ రంగులో రానుండగా.. ఎవో మోడల్ లైట్ బ్లూ కలర్ వేరియంట్‌లో లభించనుంది. డిజైన్ పరంగా రెండింటి మధ్య స్పష్టమైన తేడాలు ఉన్నాయి. ఏస్ 5జీ వెనుక వైపు మూడు కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన రెక్టాంగ్యులర్ కెమెరా మోడ్యూల్ అమర్చారు. ఇక ఎవో మోడల్‌లో రెండు కెమెరాలతో కూడిన చదరపు ఆకారపు (స్క్వేర్) ఐలాండ్ ఉంటుంది. రెండు ఫోన్లలోనూ పంచ్ హోల్ కటౌట్‌తో కూడిన ఫ్లాట్ డిస్‌ప్లేను అందించారు. ఏస్ 5జీ ఫోన్ 9.49 మిమీ మందంతో ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తుంది.

అద్భుతమైన కెమెరా స్పెసిఫికేషన్లు

ఫొటోగ్రఫీ ప్రియులను విశేషంగా ఆకట్టుకునేలా బోల్ట్ సంస్థ వీటి కెమెరా వ్యవస్థను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దింది. ఏస్ 5జీ ఫోన్‌లో f/1.8 అపెర్చర్‌ కలిగిన శక్తివంతమైన 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అమర్చారు. మరోవైపు ఎవో మోడల్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను పొందుపరిచారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం రెండు ఫోన్లలోనూ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించడం విశేషం. ఫొటోల్లో సహజమైన స్కిన్ టోన్ వచ్చేలా ఈ ఫ్రంట్ కెమెరాలలో ప్రత్యేకంగా ‘రియల్ టోన్’ సపోర్ట్‌ను కూడా జోడించారు.

గూగుల్ ఏఐ, జెమిని ఆధునిక హంగులు

ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ల ప్రధాన హైలైట్ గూగుల్ ఏఐ ఫీచర్లే అని చెప్పవచ్చు. తక్కువ వెలుతురులోనూ అత్యంత స్పష్టమైన ఫొటోలను క్యాప్చర్ చేయడానికి ఏఐ నైట్ మోడ్, సీన్ ఆప్టిమైజేషన్, అలాగే బ్లర్ అయిన ఫొటోలను కూడా అప్పటికప్పుడు క్లియర్ చేసే ‘ఫేస్ అన్ బ్లర్’ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు స్క్రీన్ పై కనిపించే ఏదైనా సమాచారాన్ని క్షణాల్లో వెతికేందుకు ‘సర్కిల్ టు సెర్చ్’, భాషా మార్పిడి కోసం ‘గూగుల్ లెన్స్’ టెక్నాలజీ అందుబాటులో ఉంది. గూగుల్ జెమిని సపోర్ట్ లభించడం వల్ల రోజువారీ పనులు, సంభాషణలు మరింత సులువుగా మారతాయి. ఈ ఫోన్ల ప్రాసెసర్, బ్యాటరీ సామర్థ్యం, అసలు ధర ఎంతనే పూర్తి వివరాలు ఆగస్టు 25న జరిగే లాంచ్ ఈవెంట్‌లో అధికారికంగా వెల్లడి కానున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us