CCTV: వీటితో మీ ఇల్లు సేఫ్‌.. రూ. 1500 లోపు బెస్ట్ సీసీటీవీ కెమెరాలు..

|

Jul 19, 2024 | 5:00 PM

దొంగల బెడద, ఇంట్లో చిన్నారులను ఒంటరిగా వదిలి వెళ్లినా.? దుకాణాల్లో సైతం సీసీటీవీల ఏర్పాటు అనివార్యంగా మారింది. దీంతో చాలా కంపెనీలు సీసీ టీవీలను తీసుకొస్తున్నాయి. అయితే ధరలు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. మరి ప్రస్తుతం రూ. 1500 లోపు అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ సీసీటీవీ కెమెరాలు, వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి..

CCTV: వీటితో మీ ఇల్లు సేఫ్‌.. రూ. 1500 లోపు బెస్ట్ సీసీటీవీ కెమెరాలు..
Cctv Camera
Follow us on

ఒకప్పుడు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు అంటే పెద్ద తతంగం ఉండేది. కొనుగోలు మొదలు ఇన్‌స్టాలేషన్ వరకు అదొక పెద్ద ప్రాసెస్‌. ధర కూడా రూ. వేలల్లో ఉండేది. అయితే ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. తక్కువ ధరలోనే సీసీటీవీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. అంతేనా ఇన్‌స్టాలేషన్‌ కూడా చాలా సులువుగా మారిపోయింది. ఇంట్లో కేవలం వైఫై కనెక్షన్‌ ఉంటే చాలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మీ ఇంట్లో ఏం జరుగుతుంతో తెలుసుకోవచ్చు.

దొంగల బెడద, ఇంట్లో చిన్నారులను ఒంటరిగా వదిలి వెళ్లినా.? దుకాణాల్లో సైతం సీసీటీవీల ఏర్పాటు అనివార్యంగా మారింది. దీంతో చాలా కంపెనీలు సీసీ టీవీలను తీసుకొస్తున్నాయి. అయితే ధరలు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. మరి ప్రస్తుతం రూ. 1500 లోపు అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ సీసీటీవీ కెమెరాలు, వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి..

CP PLUS 2MP: ఈ సీసీటీవీ ధర రూ. 1449గా ఉంది. అమెజాన్‌లో అందుబాటులో ఉంది. 360 డిగ్రీల్లో కెమెరా రొటేట్‌ అవుతుంది. 128 జీబీ వరకు స్టోరేజ్‌ చేసుకునేందుకు వీలుగా ఇందులో ఎస్‌డీకార్డును అందించారు. మోషన్‌ అలర్ట్‌, నైట్ విజన్‌, అలెక్సా, గూగుల్ సపోర్ట్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు. 1080 పిక్సెల్స్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ వీడియోను వీక్షించొచ్చు. ప్రైవెసీ మోడ్‌ సహాయంతో కెమెరాను బ్లాక్‌ కూడా చేసుకోవచ్చు.

IMOU 360° 1080P Full HD Security Camera: తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్‌ సీసీ కెమెరాల్లో ఇదీ ఒకటి. అమెజాన్‌లో సీసీటీవీ రూ. 1299కి అందుబాటులో ఉంది. ఇందులో హుమన్‌ డిటెక్షన్‌, మోషన్‌ ట్రాకింగ్‌, 2 వే ఆడియోతో పాటు నైట్ విజన్‌, డోమ్‌ కెమెరా వంటి ఫీచర్లను అందించారు. 256 జీబీ వరకు ఎస్‌డీ కార్డ్‌ సపోర్ట్ చేస్తుంది. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వంటి వాయిస్‌ కమాండ్స్‌కి ఇది సపోర్ట్ చేస్తుంది.

Tapo TP-Link C200 360°: 360 డిగ్రీల రొటేట్ కెమెరాతో అందుబాటులోకి వచ్చిన ఈ సీసీటీవీ కెమెరా ధర అమెజాన్‌లో రూ. 1599గా ఉంది. ఇందులో 1080పిక్సెల్‌ ఫుల్‌ హెచ్‌డీ క్వాలిటీతో వీడియోలను చూడొచ్చు. 2వే ఆడియో, నైట్ విజన్‌, మోషన్‌ డిటెక్షన్‌, సౌండ్ అండ్‌ లైట్‌ అలారమ్‌ వంటి ఫీచర్లను ఇచ్చారు.

Wi-Fi Camera CCTV Camera 1080p Wireless PTZ Bulb Shape: చూడ్డానికి అచ్చంగా బల్బ్‌ ఆకారంలో ఉండే ఈ సీసీటీవీ కెమెరా రూ. 1199కి లభిస్తోంది. ఇందులో 360 డిగ్రీలు రొటేట్ అయ్యే కెమెరాను అందించారు. మోషన్‌ సెన్సార్‌ ఎల్‌ఈడీ లైట్‌తో కూడిన కెమెరాను ఇందులో అందించారు. నెలకు రూ. 100 ఈఎమ్‌ఐ చెల్లించి కూడా దీనిని సొంతం చేసుకోవచ్చు.

Xiaomi Mi Wireless Home Security Camer: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం షావోమీకి చెందిన ఈ సీసీటీవీ ధర కాస్త ఎక్కువే అయినా ఫీచర్స్‌ మాత్రం బాగున్నాయి. దీని ధర రూ. 1999గా ఉంది. ఇందులో 360 డిగ్రీల వ్యూను అందించారు. అలాగే ఇందులో ఏఐ పవర్డ్‌ మోషన్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ను ఇచ్చార. నైట్ విజన్‌తో పాటు, టాక్‌ బ్యాక్‌ వంటి అధునాతన ఫీచర్‌ను ఇచ్చారు. 1080 పిక్సెల్స్‌తో కూడిన వీడియోను చూడొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి…