Artificial Intelligence: కృత్రిమ మేధ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే స‌మ‌యం ప‌డుతుంది… గూగుల్ సీఈఓ సుంద‌ర్ పిచాయ్‌…

భార‌త‌దేశంలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ)) ప్రారంభ దశలోనే ఉందని..

Artificial Intelligence: కృత్రిమ మేధ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే స‌మ‌యం ప‌డుతుంది... గూగుల్ సీఈఓ సుంద‌ర్ పిచాయ్‌...

Edited By:

Updated on: Jan 30, 2021 | 7:25 PM

భార‌త‌దేశంలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ)) ప్రారంభ దశలోనే ఉందని.. దాని నిజమైన సామర్థ్యం అందుబాటులోకి రావడానికి మరో 10–20 ఏళ్ల కాలం పడుతుందని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. భవిష్యత్తులో కరోనా తరహా అంటు వ్యాధులు వైరస్‌లను పరిష్కరించడంలో ఏఐ టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ వర్చువల్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు.

క‌ల్లోల కాలం…

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌–19 ఎంత కల్లోలాన్ని సృష్టిస్తోందో తెలిసిందే, అదే సమయంలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ పనితీరుకు సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్న సహకారాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారని సుంద‌ర్ పిచాయ్ తెలిపారు. వ్యాక్సిన్‌ పంపిణీలో కంప్యూటిక్, మిషన్‌ లెర్నింగ్, ఆల్గరిథం వంటి ఏఐ టెక్నాలజీ ఉపయోగపడగలవని.. కాకపోతే అవి ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని పేర్కొన్నారు.