Clubhouse Hack: అమ్మకానికి 38 కోట్ల మంది యూజర్ల ఫోన్‌ నెంబర్లు.. డార్క్‌ వెబ్‌లో క్లబ్‌హౌజ్‌ యూజర్ల డేటా..

|

Jul 26, 2021 | 6:38 AM

Clubhouse Hack: టెక్నాలజీ రోజురోజుకూ ఎంతలా అభివృద్ధి చెందుతుందో దాని మాటున సైబర్‌ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల తీరు యూజర్ల వ్యక్తిగత వివరాల...

Clubhouse Hack: అమ్మకానికి 38 కోట్ల మంది యూజర్ల ఫోన్‌ నెంబర్లు.. డార్క్‌ వెబ్‌లో క్లబ్‌హౌజ్‌ యూజర్ల డేటా..
Cloubehouse App
Follow us on

Clubhouse Hack: టెక్నాలజీ రోజురోజుకూ ఎంతలా అభివృద్ధి చెందుతుందో దాని మాటున సైబర్‌ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల తీరు యూజర్ల వ్యక్తిగత వివరాల భద్రతను ప్రశ్నార్థకంగా మార్చేస్తోంది. ఇప్పటికే చాలా సోషల్‌ మీడియా సైట్లకు సంబంధించిన డేటాను సైబర్‌ నేరగాళ్లు చోరి చేసిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ జాబితాలోకి మరో సోషల్‌ మీడియా యాప్‌ క్లబ్‌హౌజ్‌ వచ్చింది. ఇటీవలే సోషల్‌ మీడియా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన క్లబ్‌హౌజ్‌ అనతి కాలంలోనే బాగా ప్రాచుర్యాన్ని సంపాదించుకుంది. వినియోగదారులు తమ సందేశాలను ఆడియో రూపంలో పంచుకోవడం ఈ యాప్‌ ప్రత్యేకత.

అయితే అంతా బాగానే ఉన్న ప్రస్తుతం ఈ యాప్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. క్లబ్‌హౌజ్‌ను ఉపయోగిస్తున్న సుమారు 38 కోట్ల మంది యూజర్ల వ్యక్తిగత ఫోన్‌ నెంబర్లను హ్యాకర్లు డార్క్‌ వెబ్‌లో అమ్మకానికి ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని మార్క్‌ రూఫ్‌ అనే సైబర్‌ నిపుణుడు తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. క్లబ్‌హౌజ్‌ డేటా హ్యాక్‌కు గురైనట్లు తెలిపిన ఆయన సుమారు 3.8 బిలియన్ల ఫోన్‌ నెంబర్లను డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టినట్లు ట్వీట్‌ చేశాడు. అంతటితో ఆగకుండా సదరు డార్క్‌బెబ్‌ సైట్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను సైతం రూఫ్‌ ట్వీట్‌ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ డేటాను సొంతం చేసుకున్న వారు దేనికి ఉపయోగిస్తారాన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉంటే.. క్లబ్‌హౌజ్‌ యాప్‌ ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓస్‌ యూజర్లకు అందుబాటులో ఉంది.

Also Read: Children-Social Media: పలు అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు.. భారత్‌లో సోషల్ మీడియాకు బానిసగా మారుతున్న 10ఏళ్ల లోపు పిల్లలు

Buck Moon: ఈ రోజు, రేపు ఆకాశంలో మరో అద్భుతం.. శని, గురు గ్రహానికి సమీపంలో చంద్రుడు

Fire-Boltt Agni Smart Watch: మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ వాచ్‌.. మహిళల కోసమే ప్రత్యేకమైన ఫీచర్‌.. ధర ఎంతంటే..