Instagram: ఇన్‌స్టాగ్రామ్‌‌లో అదిరిపోయే ఫీచర్..దాని ప్రత్యేకత ఏమిటంటే..?

ప్రపంచ వ్యాప్తంగా కోట్ల సంఖ్యలో యూజర్లు ఉన్న సోషల్ మీడియా యాప్ లలో ఇన్ స్టాగ్రామ్ ఒకటి. దీని ద్వారా ఫొటోలు, వీడియోలు, రీల్స్ ను ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. ఇన్ స్టాగ్రామ్ యాజమాన్యం సంస్థ అయిన మెటా కూడా కాలానికి అనుగుణంగా యూజర్లకు మెరుగైన సేవలు అందిస్తోంది. దానిలో భాగంగా వివిధ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పుడు కొత్తగా ఇన్ స్టాగ్రామ్ బ్లైండ్ అనే ఫీచర్ ను ప్రవేశపెట్టింది. దీని ఉపయోగాలను తెలుసుకుందాం.

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌‌లో అదిరిపోయే ఫీచర్..దాని ప్రత్యేకత ఏమిటంటే..?
Instagram

Updated on: Apr 27, 2025 | 6:30 PM

సాధారణంగా స్మార్ట్ ఫోన్ లోని ఇన్ స్టాగ్రామ్ యాప్ లో మనకు నచ్చిన వీడియోలు, రీల్స్ ను వ్యక్తిగతంగా వీక్షిస్తూ ఉంటాం. వీటిలో బాగా నచ్చిన వాటిని షేర్ చేస్తాం. అవసరమైతే మన ఫ్రెండ్స్ కు పంపిస్తాం. కానీ స్నేహితులు, గ్రూపులతో కలిసి ఒకే రకమైన రీల్స్ ను చూసే అవకాశాన్ని ఇన్ స్టాగ్రామ్ బ్లైండ్ ఫీచర్ కల్పిస్తుంది. సోషల్ మీడియా యూజర్లందరూ విభిన్న ఆలోచనలు, అభిరుచులు కలిగి ఉంటారు. తమ అభిప్రాయాలను ఒకరితో మరొకరు పంచుకుంటారు. వాటిలో ప్రధానంగా వీడియోలు, రీల్స్, ఫొటోలు ఉంటాయి. కంటెంట్ షేరింగ్ అనేది అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో సాధారణమే అయినప్పటికీ, దాన్ని మరింత కొత్తగా అందించేందుకు ఇన్ స్టాగ్రామ్ సిద్దమైంది. దానిలో భాగంగానే బ్లైండ్ ఫీచర్ ను తీసుకువచ్చింది.

ఇన్ స్టాగ్రామ్ లోని డైరెక్ట్ మెసేజ్ ల (డీఎంఎస్) మాదిరిగానే కొత్త బ్లైండ్ ఫీచర్ ఉంటుంది. దీన్ని మీ స్నేహితుడు, ఫ్రెండ్స్ గ్రూపుతో కలిసి ఉపయోగించుకోవచ్చు. మీరు చూస్తున్న రీల్స్, మీ స్నేహితులు చూస్తున్న రీల్స్ అన్ని కలిసి పోయి ఒక షేర్డ్ కస్టమ్ రీల్స్ ఫీడ్ గా తయారవుతుంది. అంటే మీ ఇన్ స్టాగ్రామ్ యాక్టివిటీ ఆధారంగా రీల్స్ జాబితా తయారవుతుంది. ఆ ఫీచర్ ను ఉపయోగించే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

  • ముందుగా ఇన్ స్టాగ్రామ్ లోని ఒక డీఎం చాట్ ను ఓపెన్ చేయాలి. దానిపైన ఉన్న బ్లైండ్ ఐకాన్ ను క్లిక్ చేయాలి.
  • ఇన్వైట్ అనే ఆప్షన్ ద్వారా మీ స్నేహితులను ఆహ్వానించండి. వారు మీ ఇన్విటేషన్ ను అంగీకరిస్తే బ్లైండ్ షేర్డ్ జాబితా తయారవుతుంది.
  • ఇద్దరు స్నేహితులు బ్లైండ్ లో చేరిన వెంటనే డీఎం ద్వారా షేర్ చేసిన రీల్స్ అన్ని ఆటోమేటిక్ గా అప్ డేట్ అవుతాయి.
  • మీకు ఫోన్ లో బ్లైండ్ ఐకాన్ కనిపించకపోతే కంగారు పడొద్దు. మీ ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను అప్‌డేట్ చేయండి చాాలు.
  • బ్లెండ్ ఫీచర్ నుంచి చాలా సులభంగా వైదొలగవచ్చు. డీఎంలకు వెళ్లి, చాట్‌పై క్లిక్ చేసి, ఆపై బ్లెండ్ చిహ్నంపై నొక్కండి. రెడ్ కలర్ చిహ్నంపై క్లిక్ చేస్తే సరిపోతుది.

ఉపయోగాలు ఇవే

యూజర్ల మధ్య స్నేహభావం పెంపొందించటానికి, ప్లాట్‌ఫాంలో గడిపే సమయాన్ని పెంచడానికి కొత్త ఫీచర్ ద్వారా అవకాశం కలుగుతుంది. ఇది భాగస్వామ్య ఆసక్తుల ఆధారంగా సంభాషణలను ప్రోత్సహిస్తుంది, తమ స్నేహితులు ఎలాంటి రీల్స్‌ను ఆనందిస్తారో యూజర్లు గుర్తిస్తారు. వ్యక్తిగత సిఫారసులను అనుమతిస్తుంది. అయితే బ్లెండ్ అనేది ఇతర వ్యక్తి ఆహ్వానాన్ని అంగీకరించినప్పుడు మాత్రమే ఉపయోగించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి