Smart TV: స్మార్ట్‌ టీవీలపై ఊహించని డిస్కౌంట్స్‌.. రూ. 8 వేలకే 32 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ.. లిమిటెడ్‌ టైమ్‌ మాత్రమే..

|

Sep 23, 2022 | 11:57 AM

Amazon Great Indian Festival: అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ ఎన్నో ఆఫర్లను తీసుకొచ్చింది. అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది అమెజాన్‌. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా స్మార్ట్‌ టీవీలపై..

Smart TV: స్మార్ట్‌ టీవీలపై ఊహించని డిస్కౌంట్స్‌.. రూ. 8 వేలకే 32 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ.. లిమిటెడ్‌ టైమ్‌ మాత్రమే..
Smart Tv Offers
Follow us on

Amazon Great Indian Festival: అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ ఎన్నో ఆఫర్లను తీసుకొచ్చింది. అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది అమెజాన్‌. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా స్మార్ట్‌ టీవీలపై ఊహించని ఆఫర్లను అందిస్తోంది. కొన్ని స్మార్ట్‌ టవీలపై ఏకంగా 64 శాతం డిస్కౌంట్ లభిస్తుండడం విశేషం. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ టీవీలపై ఉన్న బెస్ట్‌ ఆఫర్లు, టీవీల ఫీచర్ల వివరాలు మీకోసం..

Mi 5A Series LED TV L32M7-5AIN: ఎమ్‌ఐ కంపెనీకి చెందిన ఈ స్మార్ట్‌ టీవీపై ఏకంగా 56 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ టీవీ అసలు ధర రూ. 24,999కాగా ఆఫర్‌లో భాగంగా రూ. 10,990కే లభిస్తోంది. అంతేకాకుండా ఎస్‌బీఐ డెబిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ టీవీ ఫీచర్ల విషయానికొస్తే.. నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌ వీడియో, యూట్యూబ్‌, డిస్నీ+హాట్‌స్టార్‌ వంటి యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 720పీ రిజల్యూషన్‌తో కూడిన ఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. వైఫై, యూఎస్‌బీ, ఈతర్‌నెట్‌, హెచ్‌డీఎమ్‌ఐ వంటి కనెక్టింగ్ ఫీచర్స్‌ ఉన్నాయి.

AmazonBasics Smart LED Fire TV AB32E10SS: అమెజాన్‌ బేసిక్స్‌ నుంచి వచ్చిన ఈ 32 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీపై ఏకంగా 63 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ టీవీ అసలు ధర రూ. 27,000 కాగా రూ. 9,999కే అందుబాటులో ఉంది. కార్డులపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌, సోనీ లివ్‌, అలెక్సా, అమెజాన్‌ వీడియో, హాట్‌స్టార్‌, యూట్యూబ్‌ యాప్‌లకు సపోర్ట్‌ చేస్తుంది. 720పి రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు.

 

Mi 80 cm (32 inches) Horizon Edition 4A | L32M6-EI:
ఈ స్మార్ట్‌ టీవీపై అమెజాన్‌ సేల్‌లో భాగంగా 25 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. అసలు ధర రూ. 19,990 కాగా డిస్కౌంట్‌లో బాగంగా రూ. 14,990కి అందుబాటులో ఉంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌తో 10 శాతం అదనపు డిస్కౌంట్‌. ఈ టీవీలో 20 వాట్స్‌ స్టీరియో స్పీకర్స్‌ను అందించారు. గూగుల్‌ అసిస్టెంట్‌, గూగుల్‌ ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.

 

Redmi 32 inches Android 11 Series HD Ready Smart LED TV | L32M6-RA/L32M7-RA:
అమెజాన్‌ సేల్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్‌ స్మార్ట్‌ టీవీల్లో రెడ్‌మీ స్మార్ట్‌ టీవీ ఒకటి అని చెప్పాలి. ఈ టీవీపై ఏకంగా 64 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ టీవీ అసలు ధర రూ. 24,999 కాగా, డిస్కౌంట్‌లో భాగంగా రూ. 8,999కి అందుబాటులో ఉంది. ఎస్‌బీ కార్డుతో అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. అన్ని రకాల యాప్స్‌కు సపోర్ట్‌ చేసే ఈ స్మార్ట్‌ టీవీలో 20 వాట్స్‌ పవర్‌ స్టీరియో స్పీకర్స్‌, డాల్బీ ఆడియో వంటి ఫీచర్లు అందించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..