ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్ ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో సేల్ నిర్వహిస్తున్న ఈ విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొదలు, గృహోపకరణాల వరకు అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. పలు రకాల క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి ఇన్‌స్టాంట్‌గా 10 శాతం డిస్కౌంట్ సైతం అందిస్తున్నారు. మరి ఈ సేల్‌లో రూ. 35వేలలోపు లభిస్తోన్న కొన్ని ల్యాప్‌టాప్‌ల వివరాలు మీకోసం..
Acer Aspire 3: అసర్ కంపెనీకి చెందిన ఈ ల్యాప్‌టాప్ ఐటెల్ కోర్ ఐ3 1215యూ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో విడుదలైన ఈ ల్యాప్‌టాప్ అసలు ధర ర. 48,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 33,900కి సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా డిస్కౌంట్ లభించనుంది. ఇంటెల్ యూహెచ్‌డీ గ్రాఫిక్స్‌ను అందించారు.
Lenovo IdeaPad Slim 3: లెనోవో కంపెనీకి చెందిన ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ ఐ3-1115జీ4 11th జనరేషన్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 15.6 ఇంచెస్‌కు చెందిన ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో తీసుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ యూహెచ్‌ఈడ గ్రాఫిక్ కార్డును అందించారు. ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 49,190కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 30,990కి సొంతం చేసుకోవచ్చు.
ASUS Vivobook 14, Intel Core i3: అసుస్ కంపెనీకి చెందిన ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 50,990కాగా, 33 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 33,990కి సొంతం చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లో 11 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ స్క్రీన్‌ను అందించారు. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ల్యాప్‌టాప్‌లో 8జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ కెపాసిటీని అందించారు.
HP Laptop 15s: హెచ్‌పీ కంపెనీకి చెందిన ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 41,660కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 33,990కి సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఇందులో 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌ను అందించారు.
Dell 14 Laptop: రూ. 35 వేలలోపు లభిస్తోన్న బెస్ట్ ల్యాప్‌టాప్స్‌లో డెల్ కంపెనీకి చెందిన డెల్ 14 ల్యాప్‌టాప్ ఒకటి. ఇంటెల్ 11th జనరేషన్ ఐ3 1115జీ4 ప్రాసెసర్‌తో పని చేసే ఈ ల్యాప్‌టాప్‌లో 14 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 49,215కాగా, 29 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 34,990కి సొంతం చేసుకోవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..