Online Scams: ఆన్‌లైన్ స్కామ్స్ విషయంలో ఎయిర్‌టెల్ కీలక చర్యలు.. ఇక మోసాలకు చెక్

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఆన్‌లైన్ స్కామ్స్ భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం డిజిటలైజ్ అవ్వడం వల్ల వివిధ స్కామ్స్ వెలుగులోకి వస్తున్నాయి. ఈ స్కామ్స్ అరికట్టడానికి ఎన్ని చర్యలు తీసుకున్నా కొత్త తరహా మోసాలతో మళ్లీ విజృంభిస్తున్నారు. అయితే తాజాగా ఈ మోసాలను అరికట్టేందుకు ప్రముఖ టెలికం కంపెనీ ఎయిర్‌టెల్ కీల చర్యలు తీసుకుంది.

Online Scams: ఆన్‌లైన్ స్కామ్స్ విషయంలో ఎయిర్‌టెల్ కీలక చర్యలు.. ఇక మోసాలకు చెక్
Airtel

Updated on: May 16, 2025 | 3:59 PM

భారతదేశంలో ప్రముఖ టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ అన్ని కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్స్‌లో హానికరమైన వెబ్‌సైట్లను రియల్ టైమ్‌లో గుర్తించి బ్లాక్ చేసేలా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏఐ ఆధారంగా తీసుకున్న ఈ పరిష్కార చర్యలు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్, ఓటీటీ మెసేజింగ్ యాప్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌తో సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ ద్వారా యాక్సెస్ చేసే ప్రమాదకరమైన లింక్లను గుర్తించి బ్లాక్ చేస్తుంది. ముఖ్యంగా ఆన్‌లైన్ మోసాల నుంచి వినియోగదారులను రక్షించడం లక్ష్యంగా ఈ కీలక చర్యలు తీసుకున్నారు. 

ఎయిర్టెల్ మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్వ్స్‌లో ఇంటిగ్రేట్ చేసిన ఈ సేవ అదనపు ఖర్చు లేకుండా అందరు వినియోగదారులకు ఆటోమెటిక్‌గా అందుబాటులో ఉంటుంది. హానికరమైన వెబ్ సైట్ గుర్తించినప్పుడు వినియోగదారులు బ్లాక్ ను వివరించే నోటిఫికేషన్ పేజీకి మళ్లించి ఆ పేజీ క్లోజ్ అవుతుంది. భారతదేశం అంతటా సైబర్ మోసం బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నామని ఎయిర్‌టెల్ ప్రతినిధులు చెబుతున్నారు. ముఖ్యంగా డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్‌ను ఉపయోగించి స్కామర్లు ఎక్కువగా దోపిడీ చేస్తున్నారు. సాంప్రదాయ ఓటీపీ దొంగతనం, స్పామ్ కాల్స్‌కు అతీతంగా హానికరమైన లింక్లను ఉపయోగించే అధునాతన పథకాలు ఇప్పుడు మిలియన్ల మంది వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. 

ఈ మోసాలను అరికట్టేందుకు ఎయిర్టెల్ ఇంజనీర్లు ఏఐను ఉపయోగించి రియల్-టైమ్ డొమైన్ ఫిల్టరింగ్‌ను నిర్వహించే మల్టీలెవల్  నిఘా వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇది వెబ్ ట్రాఫిక్‌ను గ్లోబల్ రిపోజిటరీలతో ఎయిర్టెల్ అంతర్గత డేటాబేస్లో క్రాస్-రిఫరెన్స్ చేస్తుంది. ఇలాంటి చర్యలతో వినియోగదారులు మోసపోతామనే ఆందోళన లేకుండా ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడమే తమ లక్ష్యమని ఎయిర్‌టెల్ ప్రతినిధులు చెబుతున్నారు. ఆరు నెలల ట్రయల్స్ తర్వాత కచ్చితత్వంతో కూడిన బ్లాకింగ్ సిస్టమ్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సేవ ప్రస్తుతం హర్యానా సర్కిల్లో అందుబాటులో ఉంది. త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి