కూలర్‌లో నీళ్లు మార్చకుండా అలానే వాడుతున్నారా? ఎంత డేంజరో తెలుసా?

వేసవిలో ఎయిర్ కూలర్ తప్పనిసరి. అయితే, కూలర్‌లోని నీటిని రోజూ మార్చకపోతే బ్యాక్టీరియా, ఫంగస్, దోమలు పెరుగుతాయి. ఇది శ్వాస సంబంధిత, చర్మ సమస్యలకు దారితీస్తుంది. పిల్లలు, వృద్ధులు, అలర్జీలు ఉన్నవారికి మరింత ప్రమాదం. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే, రోజూ నీటిని మార్చడం, కూలర్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం ముఖ్యం.

కూలర్‌లో నీళ్లు మార్చకుండా అలానే వాడుతున్నారా? ఎంత డేంజరో తెలుసా?
Air Cooler

Updated on: Mar 29, 2026 | 9:03 PM

వేసవి కాలంలో ఎక్కువ మంది ఇంట్లో ఉండేది ఎయిర్ కూలర్‌. అయితే కూలర్‌లోని నీటిని ప్రతిరోజూ మార్చకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిల్వగా ఉండే నీరు బ్యాక్టీరియా, ఫంగస్, దోమల పెరుగుదలకు అనుకూలంగా మారి, గాలి ద్వారా మన శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది.

కూలర్‌లో ఒకటి లేదా రెండు రోజులు మార్పు చేయని నీరు క్రమంగా కలుషితమవుతుంది. దుమ్ము, చెమట, బయటి కాలుష్యం కలిసి నీటిలో సూక్ష్మజీవుల పెరుగుదలను వేగవంతం చేస్తాయి. ఈ నీరు గాలిలోకి ఆవిరై గదిలో వ్యాపించినప్పుడు, శ్వాస సంబంధిత సమస్యలు, అలర్జీలు, దగ్గు, జలుబు వంటి ఇబ్బందులు తలెత్తవచ్చు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఆస్థమా లేదా అలర్జీ సమస్యలు ఉన్నవారికి ఇది ఎక్కువ ప్రమాదకరంగా మారుతుంది.

చర్మ సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కలుషిత గాలి కారణంగా చర్మంపై దురద, రాషెస్, ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కూలర్ ప్యాడ్‌లు కూడా శుభ్రం చేయకపోతే ఫంగస్ పెరిగి, దాని ప్రభావం మరింత పెరుగుతుంది. కూలర్ నీటిని ప్రతిరోజూ మార్చడం, వారానికి కనీసం ఒకసారి పూర్తిగా శుభ్రపరచడం అవసరం. అదనంగా ప్యాడ్‌లను కూడా క్రమం తప్పకుండా కడగడం లేదా మార్చడం మంచిది. కూలర్‌ను గాలి సరిగ్గా ప్రవేశించే ప్రదేశంలో ఉంచడం కూడా కీలకం.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us