‘శకుని మామా’ నీ బిల్డప్‌లు ఆపవా..!: బుద్ధా వెంకన్న

టీడీపీ లీడర్.. బుద్ధా వెంకన్న ఓ రేంజ్‌లో.. ఎంపీ విజయసాయి రెడ్డిపై విమర్శలు కురిపించారు. వరుస ట్వీట్లు చేస్తూ.. విజయసాయి రెడ్డిని ‘శకుని మామా’ అంటూ సంబోధించారు. ఇకనైనా స్క్రిప్ట్ మార్చు శకుని మామా.. లేదంటే.. గతంలో రాసిన స్క్రిప్ట్‌తో.. ఐఏఎస్ అధికారులని కూడా జైల్లో కూర్చోబెట్టావ్. రివర్స్ టెండరింగ్, ఎలెక్ట్రిక్ బస్సులు, భూ సర్వే కోసం కొత్త టెక్నాలజీ అంటూ సంతకాలు పెట్టమంటే అమాయకంగా సంతకాలు పెట్టి జైలుకి వెళ్లడానికి అధికారులు సిద్ధంగా లేరు. అంటూ […]

'శకుని మామా' నీ బిల్డప్‌లు ఆపవా..!: బుద్ధా వెంకన్న
Follow us

| Edited By:

Updated on: Sep 27, 2019 | 5:11 PM

టీడీపీ లీడర్.. బుద్ధా వెంకన్న ఓ రేంజ్‌లో.. ఎంపీ విజయసాయి రెడ్డిపై విమర్శలు కురిపించారు. వరుస ట్వీట్లు చేస్తూ.. విజయసాయి రెడ్డిని ‘శకుని మామా’ అంటూ సంబోధించారు. ఇకనైనా స్క్రిప్ట్ మార్చు శకుని మామా.. లేదంటే.. గతంలో రాసిన స్క్రిప్ట్‌తో.. ఐఏఎస్ అధికారులని కూడా జైల్లో కూర్చోబెట్టావ్. రివర్స్ టెండరింగ్, ఎలెక్ట్రిక్ బస్సులు, భూ సర్వే కోసం కొత్త టెక్నాలజీ అంటూ సంతకాలు పెట్టమంటే అమాయకంగా సంతకాలు పెట్టి జైలుకి వెళ్లడానికి అధికారులు సిద్ధంగా లేరు. అంటూ .. విజయసాయి రెడ్డిని ట్యాగ్ చేస్తూ.. ఘాటుగా ట్వీట్ చేశారు.

అయినా.. ఈ విషయం ఇంకా నీకు అర్ధం కాలేదా ? నీ బది’లీలలు’ త్వరలోనే బయటకి వస్తాయి. కిలోమీటర్ల లెక్కన నొక్కేసే ప్రతి రూపాయికి లెక్క రాసుకో. ఎందుకంటే తిరిగి ఇచ్చేయాలి కదా లేకపోతే లావైపోతావు శకుని మామా!! అంటూ.. మహేష్ బాబు డైలాగ్‌ను వేస్తూ ట్వీట్ చేశారు బుద్ధా వెంకన్న. ‘రాష్ట్ర సరిహద్దులు కూడా చెరిపేసి కవల పిల్లలు గాలి, జగ్గు చేసిన మైనింగ్ సంగతిని మర్చిపోయావా శకుని మామా? అయినా.. ఎలా మర్చిపోతావ్ లే లెక్క రాసింది నువ్వేగా.. అని విజయసాయిని ఆరోపిస్తూ.. ట్వీట్ల వర్షం చేశారు బుద్ధా వెంకన్న.