గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు..!

Chandrababu Naidu Meets Ap Governor, గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు..!

విజయవాడలోని రాజ్ భవన్‌లో ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను టీడీపీ నేతల బృందం కలిసింది. వైసీపీ ప్రభుత్వ మూడు నెలల పాలనలో జరుగుతున్న దాడులు, మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్యకు గల కారణాలు, ప్రభుత్వ వేధింపులు, టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం వంటి వాటిపై టీడీపీ నేతలు గవర్నర్‌కు వివరించారు. గవర్నర్‌ని కలిసిన వారిలో టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్, కళా వెంకట్రావు, నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమ, బుద్దా వెంకన్న, అశోక్ బాబు, నిమ్మల రామానాయుడు, కరణం బలరాం, అచ్చెం నాయుడు, నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య , యలమంచిలి రాజేంద్రప్రసాద్,
ఇతర నాయకులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *