Breaking News
  • భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 24,248 కేసులు, 425 మంది మృతి. దేశవ్యాప్తంగా 6,97,413 కేసులు,19,693 మంది మృతి. దేశ వ్యాప్తంగా 2,53,287 యాక్టీవ్ కేసులు,4,24,433 మంది డిశ్చార్జ్. దేశంలో 60.77 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • హైదరాబాద్‌లో లాలాపేట పరిధిలో సాధారణ ఇంటికి రూ.25 లక్షల కరెంట్ బిల్లు. మార్చి 6 నుంచి జులై 6 వరకు బిల్లు తీశారు. ఈ నాలుగు నెలల్లో 34,5007 యూనిట్లు విద్యుత్ వాడినట్లు చూపించి.. ఏకంగా రూ. 25,11,467 బిల్లు వేశారు.
  • మహేష్ భగవత్, రాచకొండ సిపి. కమిషనరేట్ పరిధిలో 53 మంది సిబ్బందికి కరోన సోకింది. ఎలాంటి ఆత్మస్థైర్యం కోల్పోకుండా కరోనా ని జయించారు. కరోనా సోకిందని తెలిసినా ఎవరూ భయపడవద్దు. సరైన ఆహారం జాగ్రతలు పాటిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు ఇందుకు తమ సిబ్బందే ఉదాహరణ. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలి. ప్రత్యేక డ్రైవ్ చెప్పట్టి మాస్క్ లేకపోతే ఫైన్ లు విధిస్తున్నాం. ఎవరైనా గుమిగూడి కార్యక్రమాలు చేస్తున్నా, వేడుకలు చేస్తున్న ప్రజలు సమాచారం ఇవ్వండి.
  • ప్రకాశం: ఒంగోలు రిమ్స్‌ దగ్గర ల్యాబ్‌ టెక్నీషియన్ల ఆందోళన... ట్రూనాట్‌ ల్యాబుల్లో టెక్నీషియన్లకు శెలవులు ఇవ్వకుండా పనిచేస్తున్నారంటూ ఆరోపణ... వెంటనే శెలవులు ఇవ్వాలని డిమాండ్‌... ఒంగోలులో ఓ ల్యాబ్‌ టెక్నీషియన్‌కు పాజిటివ్‌, మార్కాపురంలో మరో ల్యాబ్‌ టెక్నీషియన్‌ కరోనాతో మృతి చెందడంతో ఆందోళనలో ల్యాబ్‌ టెక్నీషియన్లు.
  • అమరావతి : ఏపీ పాఠశాలల నిర్వహణలో సాంకేతికను జోడిస్తూ మార్పులు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పనిదినాలు కుదించిన విద్యాశాఖ . ఈ నెల 13వ తేదీ నుంచి ప్రాథమిక పాఠశాలలు వారానికో ఒకరోజు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు వారానికి రెండ్రోజులు పనిచేసేలా సర్క్యులర్ జారీ చేసిన పాఠశాల విద్యా శాఖ .
  • గుంటూరు: ఇంజనీరింగ్ విద్యార్దిని అశ్లీల వీడియోల చిత్రీకరణ కేసులో మరికొందరిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు. వీడియోలు చూసిన వారిని లింక్ లు ఓపెన్ చేసిన వారిని కూడ గుర్తించిన పోలీసులు. మరో ఇద్దరు పోలీసులు అదుపులో. ఈ రోజు మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం.

ఇద్దరు అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

Red Sandalwood smugglers, ఇద్దరు అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

కడప జిల్లాలోని మైదుకూరులో ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఎర్రచందనంను స్మగ్లర్లు తరలిస్తున్నారన్న సమాచారంతో ఆదివారం టాస్క్‌ఫోర్సు సిబ్బంది, మైదుకూరు పోలీసులు.. పోరుమావిళ్ల-మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలోని ఎర్రచెరువు క్రాస్ రోడ్డు వద్ద తనిఖీలు చేశారు. తమిళనాడుకు చెందిన మినీ లారీని తనిఖీ చేయగా.. అందులో 90ఎర్రచందనం దుంగలు లభించాయి. పట్టుబడిన ఇద్దరు అంతరాష్ట్ర స్మగ్లర్లని.. వారిలో కోల్‌కతా కాలీఘట్‌కు చెందిన రాణా దత్తా, తమిళనాడుకు చెందిన ఉలగంధన్ వేలు ఉన్నారని అధికారులు ప్రకటించారు. వీరి వద్ద నుంచి దుంగలతో పాటు ఒక వాహనం, 2 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని జిల్లా అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ చెప్పారు.

Related Tags