20 నుంచి డోర్స్ ఓపెన్.. ఎవరైనా చేరొచ్చు: ఎమ్మెల్యే పెద్దారెడ్డి

MLA Kethireddy pedhareddy, 20 నుంచి డోర్స్ ఓపెన్.. ఎవరైనా చేరొచ్చు: ఎమ్మెల్యే పెద్దారెడ్డి

తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనెల 20 నుంచి తలుపులు తెరుస్తామని ఎవరైనా పార్టీలో చేరవచ్చని అన్నారు. పార్టీలో చేరేందుకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదన్నారు. నేరుగా తన వద్దకు వచ్చి పార్టీలో చేరవచ్చునన్నారు. కేవలం తాడిపత్రి మున్సిపాలిటీలోని వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించామని తెలిపారు. జూలై 5నుంచి తాడిపత్రిలో మట్కా కనబడకూడదని పోలీసులను హెచ్చరించారు. అప్పటిలోగా పోలీసులు మట్కాను అరికట్టకుంటే వైసీపీ తరపున వార్డుకు ముగ్గురు నుంచి ఐదుగురిని నియమించి మట్కా రాసేవారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించడం జరుగుతుందని చెప్పారు. కాగా, వైసీపీ పేరుతో బెదిరిపులకు దిగుతున్నారని మాజీ ఎంపీ తనయుడు జేసీ పవన్‌ ఆరోపణల్లో నిజం లేదన్నారు. గతంలో ఎవరు బెదిరింపులకు పాల్పడేవారో అందరికి తెలుసన్నారు. ని ఎద్దేవ చేశారు. స్పర్శ పేరుతో విరాళాలు సేకరించి కొనుగోలు చేసిన వాటిని తిరిగి తీసుకోవడం జేసీ వర్గీయులకే చెల్లుతుందన్నారు. పట్టణంలోని వెనుకబడిన 15 వార్డుల్లో మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసి రూ.2లకే క్యాన్‌ నీటిని అందజేస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *