సైరా ట్రైలర్‌ రిలీజ్‌.. మెగా అభిమానులకు పండగే..!

Telugu Movie Sye Raa Narasimhareddy Trailer, సైరా ట్రైలర్‌ రిలీజ్‌.. మెగా అభిమానులకు పండగే..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి మూవీ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సైరా ట్రైలర్‌ను రేపు విడుదల చేసేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద నగరాల్లో ఉన్న అన్ని థియేటర్లలో సైరా ట్రైలర్ ప్రదర్శన ఉండబోతోంది. ఇదిలా ఉండగా నైజాం ఏరియాలో సుదర్శన్ లాంటి థియేటర్స్‌లో సైరా ట్రైలర్‌ను ప్రదర్శించబోతున్నారు. ఇక నైజాం థియేటర్స్ వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ అద్భుతంగా ఉంది. ఇప్పటికే అభిమానులు సైరా ట్రైలర్ కోసం సోషల్ మీడియాలో హంగామా మొదలు పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *