పొట్టి క్రికెట్‌లో రైనా రికార్డ్

ఢిల్లీ: భారత క్రికెటర్‌ సురేశ్‌ రైనా అరుదైన ఘనతను సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో ఎనిమిది వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న తొలి టీమిండియా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర‍్నమెంట్‌లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌ తరఫున ఆడుతున్న రైనా.. పాండిచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ సాధించాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో రైనా 12 పరుగులు సాధించాడు. ఫలితంగా టీ20ల్లో ఎనిమిది వేల పరుగుల మైలురాయిని చేరాడు. ప్రస్తుతం రైనా 8001 పరుగులతో ఉన్నాడు. […]

పొట్టి క్రికెట్‌లో రైనా రికార్డ్
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 06, 2019 | 7:51 PM

ఢిల్లీ: భారత క్రికెటర్‌ సురేశ్‌ రైనా అరుదైన ఘనతను సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో ఎనిమిది వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న తొలి టీమిండియా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర‍్నమెంట్‌లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌ తరఫున ఆడుతున్న రైనా.. పాండిచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ సాధించాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో రైనా 12 పరుగులు సాధించాడు.

ఫలితంగా టీ20ల్లో ఎనిమిది వేల పరుగుల మైలురాయిని చేరాడు. ప్రస్తుతం రైనా 8001 పరుగులతో ఉన్నాడు. ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో ఎనిమిది వేల పరుగుల్ని సాధించిన ఆరో క్రికెటర్‌గా రైనా నిలిచాడు. మరొకవైపు రైనాకు ఇది 300 టీ20 మ్యాచ్‌. దాంతో మూడొందల టీ20 మ్యాచ్‌లు ఆడిన రెండో భారత క్రికెటర్‌గా రైనా గుర్తింపు సాధించాడు. ఇప్పటికే 300 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఘనతను ధోని సాధించగా, ఆ తర్వాత స్థానంలో రైనా ఉన్నాడు. ఇక టీ20 ఫార్మాట్‌లో పరుగుల విషయానికొస్తే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కంటే 168 పరుగులతో ముందంజలో ఉన్నాడు రైనా. ఇప్పటివరకూ 251 టీ20 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 7,833 పరుగులు నమోదు చేశాడు.

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..