పకడ్బందీగా ‘కబాలి’ రాజకీయ వ్యూహం ఇదేనా..?

రజినీకాంత్.. రాజకీయాల్లోకి వస్తాడని.. రాడని.. గత 15 సంవత్సరాలుగా వింటున్న వార్తనే. ఇదే విషయంపై ఆయన్నడిగితే.. దేవుడు ఆదేశిస్తే.. తాను రాజకీయాల్లోకి వస్తానని ఇప్పటికే పలుమార్లు చెప్పారు. అయితే.. డిసెంబర్ 31, 2017న రజినీకాంత్ తన రాజకీయ రంగప్రవేశం గురించి వెల్లడించారు. కానీ ఇప్పటి వరకూ పార్టీ మాత్రం ప్రారంభించలేదు. ఏ రకమైన ఎన్నికల్లోనూ పాల్గొనలేదు. అయితే.. ఇప్పుడు తన రాజకీయ రంగప్రవేశం కోసం.. పకడ్బందీగా.. ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అంతేకాకుండా.. డిసెంబర్ 12న ఆయన పుట్టినరోజున […]

పకడ్బందీగా 'కబాలి' రాజకీయ వ్యూహం ఇదేనా..?
Follow us

| Edited By:

Updated on: Nov 02, 2019 | 12:59 PM

రజినీకాంత్.. రాజకీయాల్లోకి వస్తాడని.. రాడని.. గత 15 సంవత్సరాలుగా వింటున్న వార్తనే. ఇదే విషయంపై ఆయన్నడిగితే.. దేవుడు ఆదేశిస్తే.. తాను రాజకీయాల్లోకి వస్తానని ఇప్పటికే పలుమార్లు చెప్పారు. అయితే.. డిసెంబర్ 31, 2017న రజినీకాంత్ తన రాజకీయ రంగప్రవేశం గురించి వెల్లడించారు. కానీ ఇప్పటి వరకూ పార్టీ మాత్రం ప్రారంభించలేదు. ఏ రకమైన ఎన్నికల్లోనూ పాల్గొనలేదు. అయితే.. ఇప్పుడు తన రాజకీయ రంగప్రవేశం కోసం.. పకడ్బందీగా.. ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అంతేకాకుండా.. డిసెంబర్ 12న ఆయన పుట్టినరోజున కొత్త పార్టీ గురించి పలు ఆసక్తికర ప్రకటనలు చేస్తారట.

కొద్ది రోజులుగా… రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై తమిళనాడులోనే కాకుండా.. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే.. ఇప్పుడు రజనీ.. రాజకీయ పార్టీ ప్రారంభ పనులు ముమ్మరంగా కొనసాగుతోన్నాయట. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే తమ లక్ష్యమని తాజాగా.. ప్రకటించిన రజినీకాంత్.. ఆ దిశగా పనులను వేగవంతం చేశారట. అంతేకాకుండా.. అసెంబ్లీ ఎన్నికలలోపే పార్టీ కూడా ప్రారంభం చేసి.. రాజకీయంగా స్ట్రాంగ్‌ అవ్వాలని చూస్తున్నారట. అలాగే.. పార్టీ పటిష్టానికి మంచి రాజకీయ వ్యూహ కర్తను కూడా అన్వేషిస్తున్నారట. అందులోనూ.. తమ పార్టీకి సెపరేటుగా.. ఓ సొంత టీవీ ఛానెల్ కూడా ఆయన పెట్టబోతున్నట్లు.. దానికి ఐ ప్యాక్ సంస్థ అధినేత పీకే (ప్రశాంత్ కిషోర్ )ను కొద్ది రోజుల క్రితం కలిసినట్టు పలు వార్తలు కూడా వచ్చాయి.

ప్రస్తుతం తమిళనాడులో ఉన్న ప్రతీ రాజకీయ పార్టీకీ.. ఓ ఛానెల్ ఉంది. తమపై వస్తోన్న విమర్మలను తిప్పికొట్టడానికి ఖచ్చితంగా ఓ టీవీ ఛానెల్ ఉండాలని రజినీ కాంత్ ఆలోచనట. దీంతో.. త్వరలోనే ఆయన సొంత టీవీ ఛానెల్‌ను స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. అలాగే ఆ టీవీ ఛానెల్‌కి.. ‘తలైవర్, రాఘవేంద్ర, బాబా’ పేర్లు పెట్టేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

అంతేకాకుండా.. ఇప్పటికే రజినీకాంత్ పార్టీ ఎజెండా, పార్టీ నిర్మాణంపై కసరత్తులు జరుపుతున్నట్లు సమాచారం. అలాగే.. తక్కువ సమయంలో.. ప్రజల్లోకి పార్టీ ఎజెండాను ఎలా తీసుకెళ్లాలి అనే వాటిపై కూడా ఆయన తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. సూపర్‌‌ స్టార్ రజనీకాంత్‌కి మంచి క్రేజ్‌ ఉన్నా.. అది రాజకీయాల దగ్గరకు వచ్చేసరికి ఉపయోగపడదు. దీంతో.. ఆయన ఓటర్లను ఆకట్టుకోవడానికి అవసరమైన అజెండాను రూపొందించుకుంటున్నట్టు తెలుస్తోంది.

అలాగే.. పార్టీ పెట్టిన తరువాత.. తన భార్య లతతో పాటు.. తన వెన్నంటి ఉండే సన్నిహితులకు కీలక పదవులు కూడా ఇవ్వనున్నారట. అంతేకాకుండా.. ప్రముఖ నేతల వలసలపై కూడా రజనీ దృష్టి పెట్టారట. ఇతర పార్టీల్లోని ముఖ్య నాయకులను.. తన పార్టీలో చేర్చుకోవడం ద్వారా.. పార్టీ వ్యూహాలను పటిష్ట పరచాలని ఆయన వ్యూహాలు రచిస్తున్నారట.