వీపు మీద పొక్కులా..? ఇలా వదిలించుకోండి

April 28, 2024

TV9 Telugu

మొటిమలు ముఖం పైనే కాకుండా ఒక్కోసారి వీపు, ఛాతి భాగంలో కూడా వస్తుంటాయి. ముఖ్యంగా వేడి, హ్యుమిడిటీతో కూడిన వేసవిలో వీపు పైనా మొటిమలు, కురుపులు వచ్చే అవకాశాలు ఎక్కువ

ఇందుకు చెమట, జిడ్డుదనమే ప్రధాన కారణం. వీటిని తొలగించుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలు అవలంభించాలి. అసలు మొటిమలు ఎందుకు వస్తాయంటే..

చర్మంపై సెబెషియస్ గ్రంధులు ‘సీబం’ అనే పదార్థాన్ని రిలీజ్ చేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో సెబెషియస్ గ్రంధులు అతిగా స్రవించడం వల్ల చర్మ రంధ్రాలు మూత బడిపోతాయి. ఫలితంగా మొటిమలు వస్తాయి

మొటిమల నుంచి తప్పించుకోవాలంటే.. బయటి నుంచి ఇంటికొచ్చిన తర్వాత, అలాగే వ్యాయామం చేసిన వెంటనే శుభ్రంగా స్నానం చేయాలి. తద్వారా చెమట ఎప్పటికప్పుడు తొలగిపోయి సమస్య క్రమంగా తగ్గుతుంది

చాలా సందర్భాల్లో ఎవరి వీపు వారికి అందదు. దాంతో పైపైన శుభ్రం చేసుకుంటుంటారు. దీనివల్ల వీపుపై చేరిన మురికి, జిడ్డుదనం తొలగిపోక మొటిమలు, కురుపుల సమస్య తలెత్తుతుంది

అందుకే వీపును స్క్రబ్‌ చేసుకోవడం మరచిపోకూడదు. ఇందుకోసం ఇంట్లో తయారుచేసుకునే సహజసిద్ధమైన స్క్రబ్స్‌ని ఉపయోగించచ్చు. టీట్రీ ఆయిల్‌ ఎన్నో రకాల చర్మ సమస్యల్ని దూరం చేస్తుంది

ఈ నూనెతో తరచూ వీపును మర్దన చేసుకుంటే సమస్య క్రమంగా తగ్గుతుంది. అలాగే టీట్రీ ఆయిల్‌తో తయారుచేసిన లోషన్లు, క్లెన్సర్లు, క్రీమ్స్‌ ఉపయోగించినా ఫలితం ఉంటుంది

అలాగే సన్‌స్క్రీన్ వీపుకీ అప్లై చేయాలి. ఎందుకంటే చెమట, దుమ్ము కారణంగా మూసుకుపోయిన చర్మ రంధ్రాలు తెరుచుకునేందుకు ఇది సహాయపడుతుంది. దీంతో చర్మ కణాలు శుభ్రపడి మొటిమల సమస్య వేధించదు