గర్భధారణ సమయంలో ధూమపానం చేస్తే..?

Stop Smoking While Pregnant, గర్భధారణ సమయంలో ధూమపానం చేస్తే..?

గర్భధారణ సమయంలో ధూమపానం చేస్తే.. తల్లికి, బిడ్డకు తీవ్ర పరిణామాలు తప్పవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గర్భం పొందకుండా ధూమపానం నిరోధిస్తుందని వారు అంటున్నారు. ధూమపానం అనేది గర్భధారణ సమస్యల అవకాశాలను గణనీయంగా పెంచుతుంది, వీటిలో కొన్ని తల్లి మరియు బిడ్డలకు ప్రాణాంతకం కావచ్చు – ఇది గర్భస్రావాలు మరియు స్తన్యతకు కారణమవుతుంది అని పేర్కొన్నారు.

ఇక ఇలాంటి పరిణామాలు ఉన్నప్పటికీ మహిళల్లో ధూమపానం చేసేవారి సంఖ్య 1980 లో 5.3 మిలియన్ల ఉంటే 2012 లో అది గణనీయంగా 12.7 మిలియన్లకు పెరిగిందని అంచనా.

కేంబ్రిడ్జి యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం ఇంగ్లాండ్‌లో ప్రతీ సంవత్సరం 65,000 మంది మహిళలు వారి గర్భధారణ సమయంలో పొగ తాగుతారట. అంతేకాదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ప్రకారం, భారతదేశంలో పొగాకు కారణంగా ప్రతి సంవత్సరం 1 మిలియన్ కన్నా ఎక్కువ మంది మరణిస్తున్నారు.

కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు గర్భం దాల్చిన ఎలుకల మీద అధ్యయనం చేసి కొన్ని భయంకరమైన నిజాలు తెలుసుకున్నారు. ఇలా ధూమపానం చేయడం వల్ల బిడ్డకు ఆక్సిజన్ అందకపోవడం, బరువు పెరుగుదల ఆగిపోవడం, జన్యు లోపాలకు కారణం అవుతుందని వారు చెబుతున్నారు.

ప్రతి సిగరెట్‌లో నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ వంటి 4000 పైగా హానికరమైన రసాయనాలు ఉన్నాయి. పొగ త్రాగిన ప్రతిసారీ పుట్టబోయే శిశువుకి గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుందని గుర్తుంచుకోవడం మంచిది.

ఇక మీరు ధూమపానం చేసినప్పుడు,మీ బిడ్డ కూడా ధూమపానం చేసినట్లే అని అర్థంచేసుకోండి. ధూమపానం పిండంలోని జన్యు లోపాలకు కారణమవుతుంది. అంతేకదు అది గర్భస్రావం, శిశువు చనిపోవడానికి కూడా కారణమవుతుంది.

ధూమపానం వల్ల కొన్నిసార్లు శిశువు చాలా ముందుగా జన్మించడం జరుగుతుంది. ఇక ఇలా జరగడం వల్ల వినికిడి బలహీనతలు, మానసిక వైకల్యం, ప్రవర్తన సమస్యలు మరియు కొన్నిసార్లు అకాల మరణం లాంటి జీవిత సమస్యలు వస్తాయి. కాబట్టి మహిళలు గర్భధారణ సమయంలో ధూమపానానికి దూరంగా ఉంటే చాలా మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *