టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ జట్టు మారనున్నాడా.? లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రాహుల్ ఆ జట్టు నుంచి వైదొలిగే అవకాశం ఉందా.? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఇందుకు సంబంధించిన వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
2024లో ఐపీఎల్‌లో మ్యాచ్ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) యజమాని సంజీవ్ గోయెంకా, రాహుల్‌కు మధ్య జరిగిన సంభాషణ తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఫ్రాంచైజీలో అతని భవిష్యత్తుపై సందేహాలను లేవనెత్తాయి. అయితే ఆ తర్వాత గోయెంకా దీనిపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. రాహుల్ తన కుటుంబంలో భాగమని గోయెంకా తెలిపారు. అయినా జట్టు మార్పునకు సంబంధించి మరోసారి జోరుగా ప్రచారం జరుగుతోంది.
తాజా సమాచారం ప్రకారం రాహుల్ తన పాత జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)లోకి వెళ్లే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే బెంగళూరుకు జట్టుకు రాహుల్ మూడేళ్ల పాటు (2013 నుంచి 16) వరకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే సీజన్‌లో రాహుల్ కచ్చితంగా బెంగళూరు తరఫున ఆడుతాడనే చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా రాహుల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ వార్తలకు బలాన్ని చేకూర్చినట్లైంది.
ఇటీవల ఆర్‌సీబీ అభిమానితో ఇంటరాక్ట్ అయిన రాహుల్.. ‘మీరు మళ్లీ ఆర్‌సీబీకి ఆడితే చూడాలని ఉంది’ అని అడిగిన అభిమాని మాటలకు స్పందిస్తూ.. ‘అలానే ఆశిద్దాం’ అని వ్యాఖ్యానించాడు. దీంతో రాహుల్ టీమ్ మారడం పక్కా అనే వార్తలకు బలం చేకూర్చినట్లైంది. రాహుల్ ఆర్‌సీబీలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టే అలా సమాధానం ఇచ్చాడని నెట్టింట చర్చ సాగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే 2025 ఐపీఎల్‌కు సంబంధించి వేలం జరిగే వరకు వేచి చూడాల్సిందే.
I’m happy that KL Rahul knows about the rumours that are going around for him & RCB.
Please boss change your IPL team! 🙏❤️ pic.twitter.com/Os06Uj39gQ
— Kunal Yadav (@Kunal_KLR) September 14, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..