IND vs BAN: టెస్ట్ సిరీస్ కోసం భారత్‌లో అడుగుపెట్టిన బంగ్లా జట్టు..

|

Sep 15, 2024 | 10:01 PM

IND vs BAN: నజ్ముల్ హసన్ శాంటో నేతృత్వంలోని 15 మంది సభ్యుల బంగ్లాదేశ్ బృందం భారతదేశానికి చేరుకుంది. ఈరోజు తెల్లవారుజామున ఢాకా నుంచి బయలుదేరిన బంగ్లాదేశ్ జట్టు ఇప్పుడు చెన్నైలో ల్యాండ్ అయింది. తొలి టెస్టు మ్యాచ్‌కు టీమిండియా ఇప్పటికే సన్నద్ధం కాగా, ఇప్పుడు చెన్నైలో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ జట్టు రేపటి నుంచి ప్రాక్టీస్ ప్రారంభించనుంది.

IND vs BAN: టెస్ట్ సిరీస్ కోసం భారత్‌లో అడుగుపెట్టిన బంగ్లా జట్టు..
Ind Vs Ban Test Series
Follow us on

Bangladesh Team Arrives in Chennai: టీం ఇండియాతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తోపాటు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు చెన్నైకి చేరుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం మైదానంలో ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఇలా నజ్ముల్ హసన్ శాంటో నేతృత్వంలో 15 మంది సభ్యుల బంగ్లాదేశ్ దళం భారత్‌లోకి ప్రవేశించింది. ఈరోజు తెల్లవారుజామున ఢాకా నుంచి బయల్దేరిన బంగ్లాదేశ్ జట్టు ఇప్పుడు చెన్నైలో దిగింది. తొలి టెస్టు మ్యాచ్‌కు టీమిండియా ఇప్పటికే సన్నద్ధం కాగా, ఇప్పుడు చెన్నైలో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ జట్టు రేపటి నుంచి ప్రాక్టీస్ ప్రారంభించనుంది.

ఇటీవల బంగ్లాదేశ్‌ జట్టు పాకిస్థాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో విజయం సాధించింది. పటిష్టమైన పాకిస్థాన్‌పై విజయోత్సవం తర్వాత బంగ్లాదేశ్ తొలిసారి పాక్‌పై టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. తద్వారా బంగ్లాదేశ్ జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగి, పర్యాటక జట్టును టీమిండియా పట్టించుకోకపోతే ఓటమి తప్పదు.

ఇవి కూడా చదవండి

కాన్ఫిడెన్స్‌తో భారత్ చేరిన బంగ్లా..

భారత్‌లో దిగడానికి ముందు బంగ్లాదేశ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హసన్ శాంటో మాట్లాడుతూ, టెస్ట్ సిరీస్‌లో జట్టు నుంచి మంచి ప్రదర్శన ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. “ఇది ఖచ్చితంగా మాకు చాలా సవాలుతో కూడిన సిరీస్. ఒక మంచి సిరీస్ (పాకిస్థాన్‌పై) తర్వాత, జట్టు, దేశ ప్రజల విశ్వాసం ఖచ్చితంగా ఎక్కువ. ప్రతి సిరీస్‌ ఒక్కో అవకాశం. రెండు గేమ్‌లు గెలవడానికి ఆడతాం. ర్యాంకింగ్‌లో టీమిండియా మనకంటే చాలా ముందుంది. కానీ, ఇటీవల మంచి ప్రదర్శన చేశాం. ఐదు రోజులు బాగా ఆడాలన్నదే మా లక్ష్యం’ అంటూ చెప్పుకొచ్చాడు.

అజేయమైన టీమిండియా..

భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇప్పటి వరకు మొత్తం 13 టెస్టు మ్యాచ్‌లు జరగ్గా అందులో 11 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. మిగతా 2 టెస్టు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. అంటే, బంగ్లాదేశ్ జట్టు ఇప్పటి వరకు భారత్‌తో టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించలేకపోయింది.

టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు..

నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), జకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షాద్మాన్ ఇస్లాం, షకీబ్ అల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్, జఖర్ అలీ అనిక్, తస్కిన్ అహ్మద్, లిటన్ దాస్, హసన్ మహమూద్, తైజుల్ ఇస్లాం, మహ్మదుల్ హసన్ జాయ్, ఖలీద్ అహ్మద్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..