ఐపీఎల్‌లో బాగా ఆడితేనే.. శాస్త్రి

ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరిగే టి20 ప్రపంచ కప్‌లో భారత జట్టులో చోటు దక్కించుకునేందుకు మహేంద్ర సింగ్ ధోనీకి మంచి అవకాశం ఉందని ప్రధాన కోచ్ రవిశాస్త్రి పునరుద్ఘాటించారు. గత జూలైలో ఇంగ్లాండ్‌లో జరిగిన ఐసిసి ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో ధోని చివరి మ్యాచ్ ఆడారు. ఇదివరకే టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీ.. త్వరలో తన వన్డే ఇంటర్నేషనల్ కెరీర్‌ నుంచి వైదొలుగుతాడని, టి20 క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపవచ్చని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. “ధోని […]

ఐపీఎల్‌లో బాగా ఆడితేనే.. శాస్త్రి

Edited By:

Updated on: Jan 09, 2020 | 5:42 PM

ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరిగే టి20 ప్రపంచ కప్‌లో భారత జట్టులో చోటు దక్కించుకునేందుకు మహేంద్ర సింగ్ ధోనీకి మంచి అవకాశం ఉందని ప్రధాన కోచ్ రవిశాస్త్రి పునరుద్ఘాటించారు. గత జూలైలో ఇంగ్లాండ్‌లో జరిగిన ఐసిసి ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో ధోని చివరి మ్యాచ్ ఆడారు. ఇదివరకే టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీ.. త్వరలో తన వన్డే ఇంటర్నేషనల్ కెరీర్‌ నుంచి వైదొలుగుతాడని, టి20 క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపవచ్చని శాస్త్రి అభిప్రాయపడ్డాడు.

“ధోని ఖచ్చితంగా ఐపిఎల్ ఆడబోతున్నాడు, టి20 ప్రపంచ కప్‌లో ధోని పాల్గొనడం ఐపిఎల్‌లో అతని ఆటతీరుపై ఆధారపడి ఉంటుందని శాస్త్రి వివరించారు. ఇదంతా అతను ఐపిఎల్ సమయంలో ఎలా ఆడుతున్నాడనే దానిపై ఆధారపడి ఉంటుంది” అని శాస్త్రి పేర్కొన్నాడు. అంటే ఐపీఎల్ లో తనని తాను నిరూపించుకుంటేనే టీ20 ప్రపంచ కప్ లో అవకాశం లభిస్తుందని శాస్త్రి స్పష్టంచేశాడు.

Follow Us