ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. మొదటి ర్యాంకు కోహ్లిదే!

| Edited By:

Jul 23, 2019 | 10:56 PM

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కి ముందు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బ్యాటింగ్‌లో టెస్ట్ ర్యాంకులను విడుదల చేసింది. తాజా ర్యాంకింగ్స్‌లో కోహ్లీ 922 పాయింట్లతో మొదటిస్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు గత కొన్ని మ్యాచుల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న కేన్ విలియమ్‌సన్ 913 పాయింట్లతో విరాట్‌కి చేరువలో రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఎన్నో టెస్టుల్లో భారత్‌కు అండగా నిలిచి విజయాన్ని అందించిన ఛతేశ్వర్ పుజారా […]

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. మొదటి ర్యాంకు కోహ్లిదే!
Follow us on

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కి ముందు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బ్యాటింగ్‌లో టెస్ట్ ర్యాంకులను విడుదల చేసింది. తాజా ర్యాంకింగ్స్‌లో కోహ్లీ 922 పాయింట్లతో మొదటిస్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు గత కొన్ని మ్యాచుల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న కేన్ విలియమ్‌సన్ 913 పాయింట్లతో విరాట్‌కి చేరువలో రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఎన్నో టెస్టుల్లో భారత్‌కు అండగా నిలిచి విజయాన్ని అందించిన ఛతేశ్వర్ పుజారా 881 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఉన్నాడు.

ఇక బౌలింగ్ విషయానికొస్తే.. ప్యాట్ కమ్మిన్స్ మొదటిస్థానంలో, జేమ్స్ అండర్‌సన్ రెండో స్థానంలో, కగిసో రబడా మూడో స్థానంలో ఉన్నారు. టాప్ టెన్ స్థానాల్లో ఇద్దరు భారత బౌలర్లకి మాత్రమే చోటు దక్కింది. రవీంద్ర జడేజా ఆరో ర్యాంకు, రవిచంద్రన్ అశ్విన్ 10 ర్యాంకు దక్కించుకున్నారు. ఈ ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో జడేజా మూడో ర్యాంకు సాధించగా.. జేసన్ హోల్డర్, షకీబ్ అల్ హసన్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ యథావిథిగా మొదటి స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.