
పని ఒత్తిడిని పక్కన పెట్టి, రాకెట్ పట్టి కోర్టులో ప్రత్యర్థుల స్మాష్‌లను దీటుగా ఎదుర్కొంటున్నారు కార్పొరేట్ ఉద్యోగులు. టీవీ9 నెట్‌వర్క్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ రెండో రోజు పోటీలు ఉత్సాహంగా సాగాయి. భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ పర్యవేక్షణలో సాగుతున్న ఈ టోర్నీలో రెండో రోజున పలువురు ప్లేయర్లు తమ అద్భుత ప్రతిభతో తర్వాతి రౌండ్‌కు దూసుకెళ్లారు. మైక్రోసాఫ్ట్, అమెజాన్, డెలాయిట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థలతో పాటు ఫార్మా, ఇతర రంగాలకు చెందిన ప్రతినిధులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. నెట్‌ప్లే, కల్ట్‌ఫిట్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల ప్లేయర్లు కోర్టులో చిరుతల్లా కదులుతూ పాయింట్లు సాధిస్తుంటే.. ప్రేక్షకుల నుంచి చప్పట్లు మార్మోగుతున్నాయి.
నెట్‌ప్లే – కెఫేన్: సాయితేజ – హరిత జంట 15-8, 15-3తో శుభమ్ – యశస్విపై ఘనవిజయం సాధించింది.
మైక్రోసాఫ్ట్: ప్రణవ జైన్ – అనుజ దాస్ జంట 15-10, 15-8తో సాయిరాం – ఆకాంక్షపై విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరింది.
రయాన్ ఎల్‌ఎల్‌సీ: కె. రాహుల్ – వడ్లపూడి జంట 15-6, 15-7తో ఇమ్రాన్ – పునీతపై పైచేయి సాధించింది.
మైక్రోసాఫ్ట్: అనిల్ కుమార్ – గౌరీ దాల్వే జంట 15-2, 15-3తో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.
కల్ట్‌ఫిట్: పిచ్చిక జై సాయి సునీల్ – పార్వతి జంట 15-10, 15-11తో తర్వాతి రౌండ్‌కు దూసుకెళ్లింది.
ఎన్ రంగా రావు & సన్స్: చిన్మయి జి జమ్మనకట్టి [1] 15-10, 15-9తో శైలీ జలోరీపై విజయం సాధించింది.
సిరి ప్లానింగ్: కె. జీవన రెడ్డి 16-14, 15-12తో వడ్డేపల్లి ప్రమదపై హోరాహోరీగా తలపడి విజయం సాధించింది.
సనోఫీ: ప్రత్యూష సత్పతి 15-8, 15-6తో ప్రియా శర్మపై గెలుపొందింది.
అమెజాన్: లౌహిత్ [1] 15-5, 15-6తో నరేంద్ర కుమార్‌ను ఓడించి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు.
సాపియన్స్: ఆదిత్య బి.ఎస్ 16-18, 15-13, 15-11తో రాజుపై ఉత్కంఠభరిత విజయాన్ని అందుకున్నాడు.
టీసీఎస్: తోకల కౌశిక్ 15-11, 15-9తో రామ్ పై గెలిచాడు.
మైక్రోసాఫ్ట్: అభినవ్ శర్మ 15-13, 7-15, 16-14తో సాయిరాంపై పోరాడి నెగ్గాడు.
ఇన్ఫోసిస్: అనురాగ్ భట్ [2] 15-12, 16-14తో తేజ అన్వేష్ యాదవ్‌పై విజయం సాధించి ముందంజ వేశాడు.
కార్పొరేట్ ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసాన్ని నింపడంతో పాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంచడమే లక్ష్యంగా టీవీ9 నెట్‌వర్క్ చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్వార్టర్ ఫైనల్స్, సెమీస్ దిశగా పోటీలు రసవత్తరంగా మారుతుండటంతో అందరి దృష్టి ఇప్పుడు టైటిల్ విజేతలెవరనే దానిపైనే ఉంది.