Women in Blue: టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భారతీయ మహిళా జట్టు.. ఆస్ట్రేలియాపై గెలిచి సెమీస్‌లో అడుగు

Tokyo Olympics 2021 indian women hockey: టోక్యో ఒలింపిక్స్ లో నిన్న మెన్స్ హాకీ జట్టు చరిత్ర సృష్టించగా నేడు భారత మహిళా జట్టు వంతు వచ్చింది. ఆస్ట్రేలియా జట్టుపై గెలిచి సగర్వంగా..

Women in Blue: టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భారతీయ మహిళా జట్టు.. ఆస్ట్రేలియాపై గెలిచి సెమీస్‌లో అడుగు
Indian Women Hockey
Follow us

|

Updated on: Aug 02, 2021 | 10:50 AM

Tokyo Olympics 2021 indian women hockey: టోక్యో ఒలింపిక్స్ లో నిన్న మెన్స్ హాకీ జట్టు చరిత్ర సృష్టించగా నేడు భారత మహిళా జట్టు వంతు వచ్చింది.  ఆస్ట్రేలియా జట్టుపై 1-0 తేడాతో గెలిచి.. భారత జట్టు.. సగర్వంగా సెమీస్‌లో అడుగు పెట్టింది. సుదీర్ఘ విరామం తర్వాత హాకీ జట్టు సెమీస్ చేరుకుంది. పతకం సాధించాలనే పట్టుదలతో  క్వార్టర్ ఫైనల్ లో మూడు సార్లు ఒలింపిక్స్ విజేతలైన ఆస్ట్రేలియా జట్టుపై మన అమ్మాయిలు పూర్తి ఆధిపత్యాన్ని సాగించారు.  మైదానమంతా పాదరసంగా కదులుతూ మన అమ్మాయిలు  వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. భారత్ నుంచి గుర్జీత్‌ కౌర్‌… గోల్‌ చేసి భారత్‌కు తొలి పాయింట్‌ అందించింది.

దీంతో టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది.సెమీ ఫైనల్ కు చేరుకుంది. ఒలింపిక్స్ లో తొలిసారిగా విమెన్స్ ఒలింపిక్ ఫీల్డ్ హాకీ పోటీలను 1980లోనిర్వహించింది. అప్పుడు ఒలింపిక్స్ మాస్కోలో జరిగాయి. ఒలింపిక్స్ లో విమేన్ హాకీ ని ప్రవేశ పెట్టిన 36 ఏళ్ల తరువాత తొలిసారిగా 2016 లో రియో ఒలింపిక్స్ లో భారత మహిళా జట్టు పాల్గొంది. అయితే అప్పుడు గ్రూప్ స్టేజ్ లో ఎలిమినేటి అయ్యింది. అయితే ఈసారి టోక్యో ఒలింపిక్స్ లో మాత్రం మన అమ్మాయిలు.. తడబడుతూ మొదలు పెట్టిన జర్నీని .. విజయం దిశగా తీసుకునివెళ్ళారు. చరిత్ర సృష్టించారు.

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ మహిళల ప్రయాణం తడబడుతూ మొదలైంది. గ్రూప్-ఏలో మొత్తం 5 మ్యాచ్ లు ఆడిన భారత్ 2 మ్యాచ్ లలో గెలిచి, 3 మ్యాచ్ లలో ఓటమిపాలైంది. పతకం రేసు లో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో మన అమ్మాయిలు మంచి పోరాట పటిమ ప్రదర్శించారు.

Also Read: ఏళ్ల నిరీక్షణకు తెరదింపిన భారత హాకీ జట్టు.. బ్రిటన్‌పై గెలిచి సగర్వంగా సెమీస్‌లోకి అడుగు