Sania Mirza: కన్నీళ్లు, పోరాటం నా క్రీడా జీవితంలో భాగమైపోయాయి.. వింబుల్డన్‌కు ఎమోషనల్‌ గుడ్‌బై చెప్పిన హైదరాబాదీ టెన్నిస్‌ స్టార్..

|

Jul 08, 2022 | 8:29 AM

Wimbledon 2022: ప్రతిష్ఠాత్మక గ్రాండ్ స్లామ్ టోర్నీ అయిన వింబుల్డన్ టోర్నీ సెమీఫైనల్లో భారత టెన్నిస్‌ స్టార్ సానియా మీర్జా (Sania Mirza) ఓడిపోయింది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో క్రోయేషియా భాగస్వామి పావిచ్‌తో కలిసి సెమీఫైనల్లో ఆడిన ఆమె..

Sania Mirza: కన్నీళ్లు, పోరాటం నా క్రీడా జీవితంలో భాగమైపోయాయి.. వింబుల్డన్‌కు ఎమోషనల్‌ గుడ్‌బై చెప్పిన హైదరాబాదీ టెన్నిస్‌ స్టార్..
Sania Mirza
Follow us on

Wimbledon 2022: ప్రతిష్ఠాత్మక గ్రాండ్ స్లామ్ టోర్నీ అయిన వింబుల్డన్ టోర్నీ సెమీఫైనల్లో భారత టెన్నిస్‌ స్టార్ సానియా మీర్జా (Sania Mirza) ఓడిపోయింది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో క్రోయేషియా భాగస్వామి పావిచ్‌తో కలిసి సెమీఫైనల్లో ఆడిన ఆమె.. నీల్(బ్రిటన్), క్రాయెసిక్(అమెరికా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. దీంతో వింబుల్డన్‌ ఛాంపియ‌న్ షిప్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్ లో విజేత‌గా నిల‌వాల‌న్న సానియా కోరిక కలగానే మిగిలిపోయింది. ఆరుసార్లు గ్రాండ్‌స్లామ్‌ ఛాంపియన్‌‌గా నిలిచిన టెన్నిస్‌ క్వీన్‌ వింబుల్డన్‌లో మాత్రం టైటిల్ సాధించలేకపోయింది. మిక్స్‌డ్‌ డబుల్స్ విభాగంలో 2009 ఆస్ట్రేలియా ఓపెన్, 2012లో ఫ్రెంచ్ ఓపెన్, 2014లో యూఎస్ ఓపెన్ టైటిళ్లను సానియా గెలుచుకుంది. మహిళల డబుల్స్ విభాగంలో 2015లో వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్, 2016లో ఆస్ట్రేలియ ఓపెన్‌ ట్రోఫీలను కైవసం చేసుకుంది. కాగా డబ్ల్యూటీఏ సర్క్యూట్‌లో తనకిదే చివరి ఏడాది అని ఇంతకుముందు సానియా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో వింబుల్డన్ టోర్నీకి గుడ్ బై చెప్పిన హైదరాబాదీ టెన్నిస్‌ స్టార్‌ భావోద్వేగానికి గురైంది. సోషల్‌ మీడియా వేదికగా ఓ ఎమోషనల్‌ నోట్‌ షేర్‌ చేసింది.

‘క్రీడలు మన నుంచి చాలా తీసుకుంటాయి. క్రీడలు మనల్ని మానసికంగా, శారీరకంగా అలసటకు గురి చేస్తాయి. గంటల తరబడి కష్టపడి ఓడిపోయిన తర్వాత నిద్రలేని రాత్రులు మిగుల్చుతాయి. అయితే ఇవన్నీ ఎన్నో ప్రతిఫలాలను ఇస్తాయి. ఏ ఇతర ఉద్యోగాలు ఇలాంటివి ఇవ్వలేవు. అందువల్ల నేను ఎప్పటికీ క్రీడలకు కృతజ్ఞురాలునే. కన్నీళ్లు, పోరాటం, ఆనందం నా క్రీడా జీవితంలో భాగం. వింబుల్డన్‌లో ఆడడం ఒక అద్భుతం. ఈసారి వింబుల్డన్‌లో ఒక ప్రేక్షకురాలిగా మాత్రమే మిగిలాను. ఇక గత 20 ఏళ్లుగా వింబుల్డన్‌లో ఆడడం గౌరవంగా భావిస్తున్నాను. ఐ విల్ మిస్ యూ’ అని భావోద్వేగానికి గురైంది సానియా.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..