స్టార్‌ ప్లేయర్లతో కూరగాయబేరాలు.. పిసినారి పీసీబీపై అక్తర్‌ ఘాటైన విమర్శలు

|

Feb 07, 2020 | 5:05 PM

అండర్‌-19 వరల్డ్‌కప్‌లో మన కుర్రాళ్లు కిరాక్‌ పుట్టించారు.. జైత్రయాత్ర చేసుకుంటూ ఫైనల్‌ వరకు వెళ్లారు… మరోవైపు దాయాది దేశం పాకిస్తాన్‌ మాత్రం ఎప్పటిలాగే చతికిలబడింది… పాపం ….మన చేతిలోనే ఓటమిపాలై ఇంటిముఖం పట్టింది…… భారత యువకుల ఆటతీరుకు పాకిస్తాన్‌ సీనియర్‌ ఆటగాళ్లు కూడా ఫిదా అయ్యారు.. మాజీ పేస్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ అయితే ఇండియా అండర్‌-19 టీమ్‌ ప్రదర్శనను మెచ్చుకుంటూనే తమ జట్టుపై తీవ్ర విమర్శలు చేశాడు.. ఆటంటే ఇండియా యూత్‌ టీమ్‌లా ఆడాలి… మీరూ […]

స్టార్‌ ప్లేయర్లతో కూరగాయబేరాలు.. పిసినారి పీసీబీపై అక్తర్‌ ఘాటైన విమర్శలు
Follow us on

అండర్‌-19 వరల్డ్‌కప్‌లో మన కుర్రాళ్లు కిరాక్‌ పుట్టించారు.. జైత్రయాత్ర చేసుకుంటూ ఫైనల్‌ వరకు వెళ్లారు… మరోవైపు దాయాది దేశం పాకిస్తాన్‌ మాత్రం ఎప్పటిలాగే చతికిలబడింది… పాపం ….మన చేతిలోనే ఓటమిపాలై ఇంటిముఖం పట్టింది…… భారత యువకుల ఆటతీరుకు పాకిస్తాన్‌ సీనియర్‌ ఆటగాళ్లు కూడా ఫిదా అయ్యారు.. మాజీ పేస్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ అయితే ఇండియా అండర్‌-19 టీమ్‌ ప్రదర్శనను మెచ్చుకుంటూనే తమ జట్టుపై తీవ్ర విమర్శలు చేశాడు.. ఆటంటే ఇండియా యూత్‌ టీమ్‌లా ఆడాలి… మీరూ ఉన్నారు ఎందుకు..? దండగ.. అన్నట్టు సాగాయి అక్తర్‌ తిట్టిపోతలు.. ఒత్తిడిని ఎలా అధిగమించాలో ఇండియాను చూసి నేర్చుకోండని ఎత్తిపొడిచాడు కూడా! ఇక ఇండియా ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ను అయితే ఆకాశానికి ఎత్తేశాడు.. పానీపూరి అమ్ముకుంటూ ఎంతో కష్టపడి టీమ్‌లో చోటు సంపాదించుకున్న జైస్వాల్‌ ఎప్పుడూ మేనేజ్‌మెంట్‌ నమ్మకాన్ని వమ్ము కానివ్వలేదని… పాక్‌ ఆటగాళ్లు మాత్రం అత్తెసరు ఆటతీరు కనబర్చారని షోయబ్‌ అక్తర్‌ అన్నాడు.. పనిలో పనిగా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుపై కూడా నాలుగు రాళ్లేశాడు అక్తర్‌.. అక్తర్‌ ఏమన్నాడంటే…. ‘భారత అండర్‌-19 జట్టుకు క్రికెట్‌లో ద వాల్‌ అని పిలుచుకునే రాహుల్‌ ద్రావిడ్‌ వంటి ఆటగాడు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.. ద్రావిడ్‌ శిక్షణలో ఆటగాళ్లు చురకత్తుల్లా మారుతున్నారు.. ఇంటర్నేషనల్‌ లెవల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు.. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డేమో అండర్‌-19 వరల్డ్‌కప్‌కు వెళ్లే టీమ్‌కు ఊరు పేరు తెలియని వాళ్లతో శిక్షణ ఇప్పించింది… పాకిస్తాన్లో ఎంతో మంది సీనియర్‌ క్రికెటర్లు ఉన్నా లైట్‌ తీసుకుంది.. నాసిరకం శిక్షణ ఇస్తే ఇలాగే ఉంటుంది.. పాకిస్తాన్‌లో యూనస్‌ ఖాన్‌, మహ్మద్‌ యూసఫ్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు ముందుకొచ్చి జట్టుక సాయం చేస్తామంటే బోర్డు మాత్రం సుముఖంగా లేదు.. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డులో ఏదో ఉద్యోగం ఉందని తెలుసుకుని యూనిస్‌ ఖాన్‌ దరఖాస్తు చేసుకుని మీ వద్దకు వస్తే మీరేం చేశారు..? అతనితో కూరగాయలు బేరమాడినట్టు బేరమాడారు. అతడు అడిగిన 15 లక్షల రూపాయలు ఇవ్వకుండా 13 లక్షలకే చేయమన్నారు.. ఇదేనా సీనియర్‌ క్రికెటర్లకు మీరు ఇచ్చే విలువ. స్టార్‌ క్రికెటర్లను ట్రీట్‌ చేసే పద్దతి ఇదేనా..? . మీరు అండర్‌ 19 స్థాయి క్రికెట్‌ ఆడిన వారితో మాత్రమే కోచింగ్‌ ఇప్పిస్తామంటే మన క్రికెట్‌ ఎప్పటికీ బాగుపడదు’అంటూ గట్టిగానే తిట్టిపోశాడు అక్తర్‌.. జూనియర్ స్థాయి నుంచి క్రికెటర్ల ప్రతిభను గుర్తించాలని.. వారికి సరైన కోచింగ్‌ ఇవ్వాలని అక్తర్‌ అన్నాడు..