ప్రపంచ మహమ్మరి కరోనా ఎవరిని వదలడంలేదు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అయా దేశ ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ రోజురోజుకూ కొవిడ్-19 వైరస్ సోకిన కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆరోగ్యం ఉన్నవారిని సైతం ఆగం చేస్తుంది. ప్రముఖ క్రీడాకారులు మాయదారి వైరస్ బారినపడుతున్నారు. తాజాగా పోర్చుగీస్ ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో రెండోసారి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. గతంలో కరోనా బారినపడ్డ రోనాల్డో పూర్తిగా కోలుకుని ఛాంపియన్ లీగ్ కు సిద్ధమయ్యారు. అయితే, తాజాగా మరోసారి ఆయన్ను పరిశీలించిన వైద్యులు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారించారు. కరోనా సోకడం వల్ల క్రిస్టియానో రోనాల్డో బుధవారం బార్సిలోనాతో జరిగిన ఛాంపియన్స్ లీగ్‌లో ఆడకపోవచ్చని అధికారులు తెలిపారు. అక్టోబర్ 13న రోనాల్డోకు కొవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు పరీక్షలో వెల్లడైంది. దీంతో ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.