వారికి ఒక్క అవకాశం ఇస్తే..అద్బుతాలు సృష్టిస్తారు.. రోహిత్ సూచన

|

Feb 27, 2022 | 9:56 AM

శ్రీలంక(Sri Lanka)తో జరిగిన రెండో టీ20 విజయంలో కీలక పాత్ర పోషించిన ముగ్గురిపై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) ప్రశంసలు కురిపించాడు. రవీంద్ర జడేజా, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్ లు....

వారికి ఒక్క అవకాశం ఇస్తే..అద్బుతాలు సృష్టిస్తారు.. రోహిత్ సూచన
Rohit 1
Follow us on

శ్రీలంక(Sri Lanka)తో జరిగిన రెండో టీ20 విజయంలో కీలక పాత్ర పోషించిన ముగ్గురిపై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) ప్రశంసలు కురిపించాడు. రవీంద్ర జడేజా, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్ లు అద్భుతంగా ఆడి, జట్టును విజయ తీరాలని చేర్చారని కితాబిచ్చాడు. భారత బ్యాటింగ్​యూనిట్​లో అసాధారణమైన ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఉన్నారని హర్షం వ్యక్తం చేశాడు. జట్టు మిడిలార్డర్ నిలబడటం చాలా కీలకమని హిట్ మ్యాన్ చెప్పాడు. మిడిలార్డర్ బ్యాటర్లు మంచి భాగస్వామ్యం నెలకొల్పడం సంతోషకరంగా ఉందని తెలిపాడు. జట్టులో చాలా మందికి ప్రతిభ ఉందని, వారికి ఓ అవకాశం ఇస్తే తామేంటో నిరూపించుకుంటారని రోహిత్ అన్నాడు. బౌలర్లపై ఒత్తిడి తీసుకురాకుండా, ప్రశాంతంగా ఆడాలని సూచించాడు. రెండో టీ20 లో మొదటి కొన్ని ఓవర్లలో బౌలింగ్​బాగా వేశామని, కానీ చివరి ఐదు ఓవర్లలో వారు ఊహించని స్కోరు చేశారని అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సంయమనం కోల్పోకుండా ఆడాలని సూచించాడు.

శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్(Team India) ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 184 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 17.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) అజేయంగా 74 (44 బంతుల్లో), రవీంద్ర జడేజా(Ravindra Jadeja) అజేయంగా 45 (18 బంతుల్లో) పరుగులు చేశారు. సంజూ శాంసన్ 39 పరుగులు చేశాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్‌కు ఇది వరుసగా 11వ విజయం. భారత్‌ కేవలం మరో విజయంతో ప్రపంచ రికార్డును సమం చేసేందుకు సిద్ధమైంది. ఆఫ్ఘనిస్థాన్ వరుసగా 12 టీ20 మ్యాచ్‌లు గెలిచింది. సొంతగడ్డపై ఈ ఫార్మాట్‌లో భారత్‌ వరుసగా ఏడో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Also Read

రష్యాలో అంతర్జాతీయ క్రీడా పోటీలకు విముఖత.. ఇప్పటికే దూరమైన టోర్నీలు

Tomato for health: ఖాళీ కడుపుతో టొమాటో జ్యూస్‌.. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా?

Bangarraju: ఓటిటిలోనూ దూసుకుపోతున్న బంగార్రాజు.. సరికొత్త రికార్డ్ అందుకున్న సినిమా..