అందుకే వరల్డ్‌కప్‌లో ఓడిపోయాం: రవిశాస్త్రి

| Edited By:

Aug 18, 2019 | 9:16 AM

ప్రపంచకప్‌లో భారత్ ఓటమిపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి, సలహా కమిటీకి వివరణ ఇచ్చారు. కోచ్‌ ఎంపిక సమయంలో వరల్డ్‌కప్‌లో భారత్ ఎందుకు ఓడిపోయిందంటూ కపిల్‌దేవ్ నేతృత్వంలోని సలహా కమిటీ ప్రశ్నించగా అందుకు స్పందిస్తూ.. తాను కోరుకున్న ఆటగాళ్లను ఎంపిక చేయలేదని, ఆటగాళ్ల ఎంపికలో సెలక్టర్లు కోచ్ సలహాలు, సూచనలు తీసుకోవాలి అని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక మిడిలార్డర్‌లో తాను సూచించిన వారిని తీసుకోలేదని రవిశాస్త్రి వారికి చెప్పినట్లు సమాచారం. కాగా రెండోసారి కూడా టీమిండియా కోచ్‌గా కపిల్ […]

అందుకే వరల్డ్‌కప్‌లో ఓడిపోయాం: రవిశాస్త్రి
Follow us on

ప్రపంచకప్‌లో భారత్ ఓటమిపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి, సలహా కమిటీకి వివరణ ఇచ్చారు. కోచ్‌ ఎంపిక సమయంలో వరల్డ్‌కప్‌లో భారత్ ఎందుకు ఓడిపోయిందంటూ కపిల్‌దేవ్ నేతృత్వంలోని సలహా కమిటీ ప్రశ్నించగా అందుకు స్పందిస్తూ.. తాను కోరుకున్న ఆటగాళ్లను ఎంపిక చేయలేదని, ఆటగాళ్ల ఎంపికలో సెలక్టర్లు కోచ్ సలహాలు, సూచనలు తీసుకోవాలి అని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక మిడిలార్డర్‌లో తాను సూచించిన వారిని తీసుకోలేదని రవిశాస్త్రి వారికి చెప్పినట్లు సమాచారం. కాగా రెండోసారి కూడా టీమిండియా కోచ్‌గా కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామి కమిటీ రవిశాస్త్రిని ఎంపిక చేసింది. 2021 టీ20 ప్రపంచకప్ పోటీల వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈ సందర్భంగా మాట్లాడిన రవిశాస్త్రి.. తనపై విశ్వాసం ఉంచి మరోసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపాడు. భవిష్యత్‌లో అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కోసం తన జట్టు కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు.