బెంగళూరు బుల్స్ చేతిలో చిత్తుగా ఓడిన తెలుగు టైటాన్స్

|

Aug 09, 2019 | 4:28 AM

ప్రొ కబడ్డీ లీగ్ సీజన్‌ 7లో తెలుగు టైటాన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. బెంగళూరు బుల్స్‌తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు 26-47 తేడాతో  దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. టోర్నీలో మొత్తం 12 జట్లు పోటీపడుతుండగా.. ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవని జట్టు.. తెలుగు టైటాన్స్ మాత్రమే కావడం గమనార్హం. మ్యాచ్ ఆరంభ నిమిషంలోనే రైడర్ విశాల్ భరద్వాజ్ తొందరపడటంతో బెంగళూరు బుల్స్‌కి పాయింట్‌ని సమర్పించుకున్న తెలుగు టైటాన్స్ ఆఖరి వరకూ అదే […]

బెంగళూరు బుల్స్ చేతిలో చిత్తుగా ఓడిన తెలుగు టైటాన్స్
Follow us on

ప్రొ కబడ్డీ లీగ్ సీజన్‌ 7లో తెలుగు టైటాన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. బెంగళూరు బుల్స్‌తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు 26-47 తేడాతో  దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. టోర్నీలో మొత్తం 12 జట్లు పోటీపడుతుండగా.. ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవని జట్టు.. తెలుగు టైటాన్స్ మాత్రమే కావడం గమనార్హం.

మ్యాచ్ ఆరంభ నిమిషంలోనే రైడర్ విశాల్ భరద్వాజ్ తొందరపడటంతో బెంగళూరు బుల్స్‌కి పాయింట్‌ని సమర్పించుకున్న తెలుగు టైటాన్స్ ఆఖరి వరకూ అదే తడబాటుని కొనసాగించింది. ఈ క్రమంలో మ్యాచ్ సగం టైమ్ ముగిసే సమయానికి 14-21 తేడాతో వెనకబడిన తెలుగు టైటాన్స్.. ఆ తర్వాత మరీ తీసికట్టుగా మారిపోయింది. దీంతో టోర్నీలో ఆరో మ్యాచ్‌ ఆడిన తెలుగు టైటాన్స్ వరుసగా ఐదో పరాజయంతో పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.