కోహ్లీకి సాధ్యం కానిది ఇతడు సాధించాడు.!

|

Sep 29, 2019 | 8:03 PM

ఫార్మాట్ ఏదైనా ప్రతి రికార్డును తన వశం చేసుకుంటూ వచ్చాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరైన విరాట్ కోహ్లీ‌కు ఇప్పటివరకు సాధ్యం కానీ రికార్డును ఒక చిన్న టీమ్ కెప్టెన్ సాధించాడు. వివరాల్లోకి వెళ్తే నేపాల్ జట్టు కెప్టెన్ పరాస్ ఖట్కా టీ20ల్లో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సింగపూర్ వేదికగా  సింగపూర్, జింబాంబ్యే, నేపాల్ జట్ల మధ్య ముక్కోణపు టీ20 సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా నిన్న సింగపూర్‌తో […]

కోహ్లీకి సాధ్యం కానిది ఇతడు సాధించాడు.!
Follow us on

ఫార్మాట్ ఏదైనా ప్రతి రికార్డును తన వశం చేసుకుంటూ వచ్చాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరైన విరాట్ కోహ్లీ‌కు ఇప్పటివరకు సాధ్యం కానీ రికార్డును ఒక చిన్న టీమ్ కెప్టెన్ సాధించాడు. వివరాల్లోకి వెళ్తే నేపాల్ జట్టు కెప్టెన్ పరాస్ ఖట్కా టీ20ల్లో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సింగపూర్ వేదికగా  సింగపూర్, జింబాంబ్యే, నేపాల్ జట్ల మధ్య ముక్కోణపు టీ20 సిరీస్ జరుగుతోంది.

ఇందులో భాగంగా నిన్న సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపు కోసం నేపాల్ 151 పరుగులు చేయాల్సి ఉంది.  ఇక లక్ష్య ఛేదనలో భాగంగా ఆ జట్టు కెప్టెన్ కెప్టెన్ పరాస్ 106 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.  దీంతో టి 20లో పరుగుల ఛేదనలో అత్యధిక స్కోర్ చేసిన కెప్టెన్ గా పరాస్ చరిత్ర సృష్టించాడు.  అంతేకాక లక్ష్యఛేదనలో శతకం కొట్టిన తొలి కెప్టెన్ గా కూడా పరాస్ రికార్డుకెక్కాడు. గతంలో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 82 పరుగులు సాధించాడు.