Paris Olympics: సెమీస్‌కు ముందు భారత జట్టుకు బిగ్ షాక్.. స్టార్ డిఫెండర్‌పై నిషేధం.. ఎందుకంటే?

Indian Hockey Team: భారత్ వర్సెస్ గ్రేట్ బ్రిటన్ మధ్య జరిగిన మ్యాచ్ రెండో క్వార్టర్‌లో అమిత్ రోహిదాస్ షాట్ ఆడుతూ గ్రేట్ బ్రిటన్ ఆటగాడు విల్ కల్లానన్ ముఖాన్ని తన హాకీ స్టిక్‌తో కొట్టాడు. అయితే, మైదానంలో ఉన్న రిఫరీ ఈ ఘటనను సీరియస్‌గా తీసుకోలేదు. అయితే, బ్రిటిష్ ఆటగాళ్లు మళ్లీ వీడియో రెఫరల్ తీసుకున్నారు. ఆ తర్వాత అమిత్ రోహిదాస్‌కు రెడ్ కార్డ్ ఇచ్చారు.

Paris Olympics: సెమీస్‌కు ముందు భారత జట్టుకు బిగ్ షాక్.. స్టార్ డిఫెండర్‌పై నిషేధం.. ఎందుకంటే?
Indian Hockey Team
Follow us

|

Updated on: Aug 05, 2024 | 5:30 PM

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు హర్మన్‌ప్రీత్ సింగ్ సేన ఆగస్ట్ 6న మేక్ ఆర్ బ్రేక్ మ్యాచ్‌లో పవర్ ఫుల్ జట్టు జర్మనీతో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం టీమ్ మొత్తం అన్ని ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది. అయితే, ఈ బిగ్ మ్యాచ్‌కు ముందు భారత హాకీ జట్టుకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య పెద్ద షాక్ ఇచ్చింది. జట్టుకు అత్యంత అనుభవజ్ఞుడైన డిఫెండర్ అమిత్ రోహిదాస్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో నిషేధానికి గురయ్యాడు.

అమిత్‌పై ఒక మ్యాచ్ నిషేధం..

వాస్తవానికి ఆగస్టు 4న గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత డిఫెండర్ అమిత్ రోహిదాస్ రెడ్ కార్డ్‌కు గురయ్యాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో, అతని హాకీ స్టిక్ పొరపాటున గ్రేట్ బ్రిటన్ ఆటగాడి ముఖానికి తగిలింది. దీంతో మైదానంలో ఉన్న రిఫరీ అతడికి రెడ్ కార్డ్ ఇచ్చాడు. దీంతో అమిత్ రోహిదాస్‌కు రెడ్ కార్డ్ రావడంతో మ్యాచ్ మొత్తానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. దీంతో భారత జట్టు మొత్తం 10 మంది ఆటగాళ్లతో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. ఇప్పుడు సెమీఫైనల్ మ్యాచ్ నుంచి కూడా రోహిదాస్‌ను తప్పించాలని నిర్ణయించారు.

ఎఫ్‌ఐహెచ్ ఏం చెప్పిందంటే?

ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అమిత్ రోహిదాస్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధించినట్లు ఎఫ్‌ఐహెచ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎఫ్ఐహెచ్ ఒక ప్రకటనలో, ‘భారత్ వర్సెస్ గ్రేట్ బ్రిటన్ మధ్య మ్యాచ్ సందర్భంగా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అమిత్ రోహిదాస్ ఒక మ్యాచ్ నుంచి నిషేధించారు. అందువల్ల అతను మ్యాచ్ నంబర్ 35లో అంటే భారత్-జర్మనీ మధ్య జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆడలేడని అంటున్నారు. కాబట్టి, అమిత్ రోహిదాస్ మినహా, మిగిలిన 15 మంది ఆటగాళ్ల నుంచి సెమీ ఫైనల్స్ కోసం భారత్ తన జట్టును ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

రెడ్ కార్డ్ ఎందుకు ఇచ్చారు?

భారత్ వర్సెస్ గ్రేట్ బ్రిటన్ మధ్య మ్యాచ్ రెండవ క్వార్టర్ సందర్భంగా, అమిత్ రోహిదాస్ షాట్ ఆడుతున్నప్పుడు అతని హాకీ స్టిక్ గ్రేట్ బ్రిటన్ ఆటగాడు విల్ కాలనన్ ముఖానికి తగిలింది. అయితే, మైదానంలో ఉన్న రిఫరీ ఈ ఘటనను సీరియస్‌గా తీసుకోలేదు. అయితే, బ్రిటిష్ ఆటగాళ్లు మళ్లీ వీడియో రెఫరల్ తీసుకున్నారు. ఆ తర్వాత అమిత్ రోహిదాస్‌కు రెడ్ కార్డ్ పడింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సెమీస్‌కు ముందు భారత హాకీ జట్టుకు బిగ్ షాక్.. ఆయనపై నిషేధం
సెమీస్‌కు ముందు భారత హాకీ జట్టుకు బిగ్ షాక్.. ఆయనపై నిషేధం
శ్రావణ మాసంలో సోమ, మంగళ, శుక్రవారాల ఇలా చేస్తే.. అదృష్టమే అదృష్టం
శ్రావణ మాసంలో సోమ, మంగళ, శుక్రవారాల ఇలా చేస్తే.. అదృష్టమే అదృష్టం
మనిషి చెమటతో ఫోన్‌ ఛార్జింగ్‌.. డివైజ్‌ను రూపొందించిన శాస్త్రవేత్
మనిషి చెమటతో ఫోన్‌ ఛార్జింగ్‌.. డివైజ్‌ను రూపొందించిన శాస్త్రవేత్
మెరు ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో.. యూనివర్సిటీలపై అవగాహన
మెరు ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో.. యూనివర్సిటీలపై అవగాహన
రియల్‌మీ మరో స్మార్ట్ ఫోన్.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..
రియల్‌మీ మరో స్మార్ట్ ఫోన్.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..
మందల్లోంచి గొర్రె మిస్సింగ్‌..! ఎటుపోయిందా అని వెతుకుతుండగా ..
మందల్లోంచి గొర్రె మిస్సింగ్‌..! ఎటుపోయిందా అని వెతుకుతుండగా ..
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ తింగరి పిల్ల..
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ తింగరి పిల్ల..
SL vs IND: మూడో వన్డే నుంచి ముగ్గురు ఔట్.. లిస్టులో ఎవరున్నారంటే?
SL vs IND: మూడో వన్డే నుంచి ముగ్గురు ఔట్.. లిస్టులో ఎవరున్నారంటే?
స్మార్ట్ టాయిలెట్ అంటే ఇదేనా..? నీ కష్టం పగవాడికి కూడా రావొద్దు
స్మార్ట్ టాయిలెట్ అంటే ఇదేనా..? నీ కష్టం పగవాడికి కూడా రావొద్దు
కప్పు కాఫీ తాగితే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా.?
కప్పు కాఫీ తాగితే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా.?