TV9 Telugu
3 August 2024
టీమిండియా మాజీ లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోని రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంటాడు.
ఐపీఎల్ 2025కి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌లో రిటెన్షన్ సమస్యకు సంబంధించి ధోనిపై ఎన్నో వార్తలు వస్తున్నాయి.
ఈ సమయంలో రిటైర్మెంట్‌పైనా కీలక వ్యాఖ్యలు చేశారు. రిటెన్షన్ తర్వాత ఆలోచించాలంటూ.. ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ తెలిపాడు.
వీటన్నింటి మధ్య, వెటరన్ కెప్టెన్ ఒక పోలీసు అధికారితో ఉన్న ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.
అసలు ధోనీతో ఉన్న పోలీసు అధికారి ఎవరో తెలుసా. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఈ పోలీసు అధికారి మరెవరో కాదు. ధోనీతో కలిసి అరంగేట్రం చేసిన మాజీ భారత జట్టు ఆల్ రౌండర్ జోగిందర్ శర్మ.
12 ఏళ్ల తర్వాత ధోనీని కలిశానని హర్యానా పోలీసు అధికారి జోగిందర్ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో పేర్కొన్నారు.
2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో జోగిందర్ శర్మ వేసిన చివరి ఓవర్‌లో భారత్ పాకిస్థాన్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది.