Sania Mirza Lose Doubles: సానియా మీర్జా జోడీకి చుక్కెదురైంది. ఖతార్ ఓపెన్ సెమీఫైనల్‌లో హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా జోడీ ఓటమి చవిచూసింది. గురువారం జరిగిన సెమీఫైనల్‌లో నికోల్ మెలిచార్, డెమి షువర్స్పై 5-7, 6-2, 5-10 తేడాతో సానియా-ఆండ్రెజా జోడీ ఓడింది.
ఖతార్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ నుంచి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ నిష్క్రమించింది. సెమీఫైనల్‌లో నికోల్మెలిచార్, డెమి షువర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 నిమిషాల పాటు పోరాడారు. 5-7, 6-2, 5-10 తేడాతో సానియా-ఆండ్రెజా (స్లొవేనియా) జంట పోరాడి ఓడింది. మొదటి సెట్‌లో సమవుజ్జీల మధ్య పోటా పోటీగా ఆట సాగింది. ఇందులో 5-7తో చాలా ఉత్సాహంగా సాగింది.
అయితే రెండో సెట్‌లో మాత్రం సానియా జోడీ చమటోడ్చాల్సి వచ్చింది.కేవలం నికోల్ మెలిచార్ ద్వయం చేతిలో 6-2 పాయింట్లతో వెనుక పడింది. అయితే చివరి సెట్‌లో మాత్రం ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పోయారు సానియా జోడీ. చాలా కాలం తర్వాత ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లోకి అడుగు పెట్టారు. టాప్-200లో సానియా ఎంట్రీ ఇచ్చారు. 254 ర్యాంకు నుంచి 177వ స్థానానికి చేరుకుంది.
అంతకు ముందు… ఖతార్ ఓపెన్‌లో భారత అగ్రశ్రేణి టెన్నిస్ తార సానియా మీర్జా జోడీ సెమీస్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్స్‌లో సానియా- ఆండ్రెజా (స్లొవేనియా) జంట 6-2, 6-0 తేడాతో నాలుగో సీడ్ బ్లింకోవా- డబ్రోస్కి ద్వయాన్ని చిత్తుచేసింది. పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సానియా జోడీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. కేవలం రెండు గేమ్‌లు మాత్రమే కోల్పోయి మ్యాచ్ సొంతం చేసుకుంది.
Car Collection: ధోనీ టూ విరాట్ లగ్జరీ కార్ల కలక్షన్ చూశారా.. వారి కార్ల జాబితా మన కిరాణా జాబితా కంటే ఎక్కువ..
Viral: కాక్‌పీట్‌లో రచ్చ రచ్చ.. విమానంలో పిల్లితో పైలట్ ఫైటింగ్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్..!