French Open:17 ఏళ్లలోనే తొలి గ్రాండ్‌స్లామ్‌.. కట్ చేస్తే.. ఈ శతాబ్దపు అత్యంత సక్సెస్‌ఫుల్ ప్లేయర్‌గా రికార్డ్..

ఇగా ఇప్పటి వరకు వరుసగా 35 మ్యాచ్‌లు గెలిచింది. ఆమె కంటే ముందు వీనస్ విలియమ్స్ మాత్రమే ఈ ఫీట్ సాధించింది. దీంతో ఈ శతాబ్దంలో పుట్టిన అత్యంత విజయవంతమైన ప్లేయర్‌గా ఇగా నిలిచింది.

French Open:17 ఏళ్లలోనే తొలి గ్రాండ్‌స్లామ్‌.. కట్ చేస్తే.. ఈ శతాబ్దపు అత్యంత సక్సెస్‌ఫుల్ ప్లేయర్‌గా రికార్డ్..
Iga Swiatek

Updated on: Jun 05, 2022 | 6:30 AM

పోలాండ్ యువ స్టార్ ప్లేయర్ ఇగా స్వైటెక్‌(Iga Swiate), రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్(French Open) టైటిల్‌ను గెలుచుకుంది. దానితో ఆమె గెలుపు ప్రచారం కొనసాగుతోంది. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఓడిపోని ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ ఇగా స్వైటెక్‌.. పోలాండ్ రాజధాని వెర్సాలో జన్మించింది. అక్క టెన్నిస్ ఆడటం చూసి స్ఫూర్తి పొందిన ఇగా స్వైటెక్‌.. తను కూడా ఆడటం మొదలుపెట్టింది. ఆమె సోదరి గాయం కారణంగా ఆడటం మానేసింది. కానీ, జీవితం కొత్త మార్గాన్ని అందించడంతో, ఇక ఈ ఆటలో తన సత్తా చాటుతూ ప్రంపచ ఛాంపియన్‌గా నిలిచింది. తొలిసారిగా 2018లో జూనియర్ వింబుల్డన్ ఛాంపియన్‌గా నిలిచింది.

ఆ తర్వాత, మరుసటి సంవత్సరం ఆమె రెండో రౌండ్‌లోనే నిష్క్రమించింది. అదే సమయంలో, ఆమె ఫ్రెంచ్ ఓపెన్‌లో నాలుగో రౌండ్‌కు చేరుకోగలిగింది. ఆ సంవత్సరం ఆమె మొదటిసారిగా టాప్ 50కి చేరుకుంది. కరోనా తర్వాత ఆమె కెరీర్‌లో నిజమైన విజయాన్ని సాధించింది.

ఇగా తన పదునైన బ్యాక్‌హ్యాండ్‌కు ప్రసిద్ధి చెందింది. ఆమె చాలా మంది మగ ఆటగాళ్ల కంటే వేగంగా బ్యాక్‌బ్యాండ్‌ను కలిగిఉంది. ఇది ఆమెకు అన్ని రకాల కోర్టులలో ఆడటానికి సహాయపడుతుంది. ఆమె షాట్‌లలో పవర్ కూడా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇగా ఇప్పటి వరకు వరుసగా 35 మ్యాచ్‌లు గెలిచింది. ఆమె కంటే ముందు వీనస్ విలియమ్స్ మాత్రమే ఈ ఫీట్ సాధించింది. దీంతో ఈ శతాబ్దంలో పుట్టిన అత్యంత విజయవంతమైన ప్లేయర్‌గా ఇగా నిలిచింది. వీనస్‌ రికార్డును బద్దలు కొట్టేందుకు మరో విజయం దూరంలోనే ఆమె ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us