FIFA Vs AIFF: అఖిల భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్‌కు గట్టి షాక్ తగిలింది. ఫిఫా నియమాలకు విరుద్దంగా థర్డ్ పార్టీల జోక్యం ఉన్నందున ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ఫిఫా(FIFA) ప్రకటించింది. ఈ మేరకు ఫిఫా అపెక్స్ బాడీ కౌన్సిల్ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్‌లో సుప్రీంకోర్టు జోక్యంతో ఫిఫా ఈ చర్య తీసుకుంది. AIFF సస్పెన్షన్ తో .. త్వరలో భారతదేశంలో జరగనున్న మహిళల అండర్-17 ప్రపంచకప్‌పై కూడా ప్రభావం చూపింది. దీంతో ఈ మ్యాచ్ లపై తీవ్ర ప్రభావం చూపించింది. అండర్-17 మహిళల ప్రపంచకప్ అక్టోబర్ 11 నుంచి 30 వరకు భారత్‌లో జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యపై సస్పెన్షన్ మేఘాలు కమ్ముకున్నాయి. భారత ఫుట్‌బాల్ అసోసియేషన్‌ను సస్పెండ్ చేసి విషయంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు ఫిఫా తెలిపింది.
AIFFని సస్పెండ్ చేయడంపై FIFA ప్రకటన
FIFA ప్రకటనలో.. “ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ నియమాలు.. FIFA నియమాలకు విరుద్ధంగా ఉన్నాయని.. భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్ లో మూడవ పక్షం జోక్యం చాలా ఉందని ఇది ఫిఫా నియమాలకు విరుద్ధమని పేర్కొంది.
సస్పెన్షన్‌ను ఎప్పుడు తీసివేసే అవకాశం ఉందంటే..
తమతో కలిసి పని చేయడం ప్రారంభించినప్పుడే ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం ఉందని ఫుట్‌బాల్ అపెక్స్ బాడీ కూడా తెలిపింది. “AIFF అధికారులు.. తమ అధికారాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ.. ఫెడరేషన్ లోని రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నప్పుడు మాత్రమే ఎత్తివేయబడుతుంది.” అని పేర్కొంది. అయితే ప్రస్తుతం ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ విషయంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (CoA) జోక్యం చేసుకున్న సంగతి తెలిసిందే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..