Asian Games 2026: ఏషియన్ గేమ్స్‌లో ఊహించని షాక్.. పతకం గెలవకుండానే వెనుదిరిగిన స్టార్ షూటర్

Asian Games 2026: ఆసియా క్రీడల్లో షూటింగ్‌లో మను భాకర్ నిరాశపరిచారు. 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్‌లో 579 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. మరోవైపు ఈషా సింగ్ ఉత్కంఠభరిత ఫైనల్‌లో అద్భుతంగా పోరాడి రజత పతకం సాధించారు. చైనా షూటర్ షావో జియారుయిషువాన్‌తో జరిగిన షూట్‌ఆఫ్‌లో స్వర్ణం తృటిలో చేజారింది.

Asian Games 2026: ఏషియన్ గేమ్స్‌లో ఊహించని షాక్.. పతకం గెలవకుండానే వెనుదిరిగిన స్టార్ షూటర్
Manu Bhaker

Updated on: Sep 28, 2026 | 3:20 PM

Asian Games 2026: ప్రపంచ వేదికలపై దేశం గర్వపడేలా చేసిన రెండుసార్లు ఒలింపిక్స్ పతక విజేత మను భాకర్ ఏషియన్ గేమ్స్ టోర్నమెంట్‌లో తీవ్రంగా నిరాశపరిచారు. ఈసారితో ఎలాంటి పతకం సాధించకుండానే ఆమె ఇంటికి తిరిగి వస్తున్నారు. ప్రతిష్టాత్మక 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలోనూ ఆమె పతకం గెలవలేకపోవడమే కాకుండా, కనీసం ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయారు. అయితే ఇదే ఈవెంట్‌లో మరో భారతీయ షూటర్ ఈషా సింగ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి రజత పతకాన్ని సాధించి పెట్టడం దేశానికి ఊరటనిచ్చింది.

ఈ పోటీల క్వాలిఫికేషన్ రౌండ్‌లో మను భాకర్ 579 పాయింట్లు సాధించి 11వ స్థానానికి పరిమితమయ్యారు. ఆమె కంటే కేవలం ఒక్క పాయింట్ ఎక్కువగా స్కోర్ చేసిన ఈషా సింగ్ ఫైనల్స్ బెర్త్ దక్కించుకున్నారు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో కేవలం టాప్-8 షూటర్లకు మాత్రమే ఫైనల్స్ చేరే అవకాశం లభిస్తుంది. ఇదే విభాగంలో బరిలోకి దిగిన మరో భారతీయ క్రీడాకారిణి రాహీ సర్నోబత్ సైతం ఆశలు ఆవిరి చేస్తూ 30వ స్థానంలో నిలిచి తీవ్రంగా నిరాశపరిచారు.

ఇది కూడా చదవండి: Bats Stolen: భారతీయ క్రికెటర్లకి షాక్.. గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా లక్ష విలువైన బ్యాట్లు చోరీ

క్వాలిఫికేషన్ రౌండ్‌లో తృటిలో అర్హత సాధించిన ఈషా సింగ్ ఫైనల్‌లో మాత్రం అద్భుతమైన ఆటతీరు కనబరిచారు. ఒక దశలో ఆమె 7 సిరీస్‌ల తర్వాత కేవలం 26 స్కోర్ మాత్రమే చేసి ఎలిమినేషన్ అంచున నిలిచారు. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని నార్త్ కొరియా షూటర్‌తో హోరాహోరీగా జరిగిన మూడు సార్లు షూటఫ్ పోరులో విజయం సాధించారు. ఈ ఉత్కంఠభరిత పోరులో ఆమె రజత పతకాన్ని ఖాయం చేసుకున్నారు. ఈ ఈవెంట్‌లో ప్రపంచ రికార్డు కూడా ఈషా సింగ్ పేరిటే ఉండటం విశేషం.

బంగారు పతకం కోసం జరిగిన ఫైనల్ పోరులో ఈషా సింగ్, చైనాకు చెందిన షావో జియారుయిషువాన్ మధ్య అత్యంత ఉత్కంఠభరితమైన పోటీ నడిచింది. ఆఖరి సిరీస్ ముగిసేసరికి ఇద్దరు షూటర్లు 38-38 పాయింట్లతో సమంగా నిలిచారు. విజేతను నిర్ణయించడానికి నిర్వాహకులు షూటఫ్ నిర్వహించారు. ఈ షూటఫ్‌లో కూడా తొలి నాలుగు షాట్ల వరకు ఇద్దరూ సమానంగానే నిలిచారు. అయితే ఆఖరి షాట్‌లో ఈషా సింగ్ గురి తప్పుతుండగా, చైనా అథ్లెట్ ఖచ్చితమైన షాట్ కొట్టి గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: Video: బస్సు దిగుతుండగా రోహిత్ శర్మకు ఊహించని ప్రమాదం.. కోహ్లీ ఏం చేశాడంటే..?

ప్రస్తుత ఏషియన్ గేమ్స్ క్రీడల్లో భారత జట్టు పతకాల వేటను విజయవంతంగా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు భారత్ ఖాతాలో మొత్తం 39 పతకాలు చేరాయి. వీటిలో 4 గోల్డ్, 17 సిల్వర్, 18 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా షూటింగ్ విభాగంలో భారత క్రీడాకారులు ఇప్పటివరకు 12 పతకాలను సాధించారు. ఇక అథ్లెటిక్స్ విభాగంలో మన అథ్లెట్లు అత్యధికంగా 13 పతకాలు గెలుచుకుని దేశ కీర్తిని మరింత ఇనుమడింపజేశారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!

Loading...
Unable to load recommendations.
Follow Us