‘వి వాంట్ ధోని’.. ఐసీసీకి పోటెత్తిన రీ-ట్వీట్లు!

|

Dec 26, 2019 | 3:01 PM

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వన్డే వరల్డ్‌కప్ తర్వాత నుంచి క్రికెట్ ఆడకపోయినా.. అతడ్ని అభిమానించేవారు కోకొల్లలు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ టీ20 ప్రపంచకప్, ఐసీసీ వన్డే ప్రపంచకప్ వంటి మెగా ట్రోఫీలను టీమిండియా ధోని సారధ్యంలోనే గెలుపొందింది. ఆస్ట్రేలియన్ లెజెండ్ రికీ పాంటింగ్ తర్వాత కెప్టెన్‌గా ధోనికి ఉన్న రికార్డు మరెవ్వరికీ లేదనే చెప్పాలి. అంతేకాకుండా చాలామంది సీనియర్ ఆటగాళ్లు ధోనిని కెప్టెన్‌ అఫ్ […]

వి వాంట్ ధోని.. ఐసీసీకి పోటెత్తిన రీ-ట్వీట్లు!
Follow us on

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వన్డే వరల్డ్‌కప్ తర్వాత నుంచి క్రికెట్ ఆడకపోయినా.. అతడ్ని అభిమానించేవారు కోకొల్లలు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ టీ20 ప్రపంచకప్, ఐసీసీ వన్డే ప్రపంచకప్ వంటి మెగా ట్రోఫీలను టీమిండియా ధోని సారధ్యంలోనే గెలుపొందింది.

ఆస్ట్రేలియన్ లెజెండ్ రికీ పాంటింగ్ తర్వాత కెప్టెన్‌గా ధోనికి ఉన్న రికార్డు మరెవ్వరికీ లేదనే చెప్పాలి. అంతేకాకుండా చాలామంది సీనియర్ ఆటగాళ్లు ధోనిని కెప్టెన్‌ అఫ్ ది డెకేడ్‌గా అభివర్ణించారు. తాజాగా ఐసీసీ కూడా ఇదే కోవలో దశాబ్దపు మేటి కెప్టెన్ ఎవరని ఫ్యాన్స్‌ను అడగ్గా.. భారత్ అభిమానులు తడుముకోకుండా మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీనే అంటూ రీ-ట్వీట్లు చేశారు.

ఐసీసీ నిర్వహించిన అన్ని ట్రోఫీలను కైవసం చేసుకోవడమే కాకుండా టీమిండియాకు ఎన్నో అపూరూపమైన విజయాలు దక్కడానికి ధోని కీలక పాత్ర వ్యవహరించాడు. ‘ప్రపంచ క్రికెట్‌లోనే కాదు.. భారత్‌లో అతడే అత్యుత్తమ కెప్టెన్ అని కొంతమంది ఫ్యాన్స్ మిస్టర్ కూల్‌పై ప్రశంసలు కురిపించారు.

మరికొందరైతే.. ‘ఈ దశాబ్దం ధోనిది.. వచ్చే దశాబ్దం కోహ్లీది’ అని రీ-ట్వీట్లు చేశారు. ఏది ఏమైనా క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటుగా లెజండరీ బ్యాట్స్‌మెన్స్‌కు కూడా ధోని అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన మార్క్ గుర్తింపు సాధించాడని తెలుసు. కాగా, వన్డే వరల్డ్‌కప్ తర్వాత క్రికెట్‌కు దూరమైనా ధోని.. మళ్ళీ రీ-ఎంట్రీ ఎప్పుడిస్తాడో ఇంకా తెలియాల్సి ఉంది.