IPL 2021: ఐపీఎల్ 2021 సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జెర్సీని టీమ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రివీల్ చేసేశాడు. ఇన్‌స్టాగ్రమ్ వేదికగా వీడియోను పోస్ట్ చేసిన డేవిడ్ వార్నర్.. అందులో ఎస్ఆర్‌హెచ్ న్యూ జెర్సీని ధరించి కనిపించాడు. అభిమానులను కనువిందు చేశాడు. ఐపిఎల్ 2021 ప్రారంభానికి కొన్ని రోజుల ముందు వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీని అందుకున్నాడు. మరో రెండు రోజుల్లో మ్యాచ్ ప్రారంభం కానుండగా.. ఇక ఉండబట్టలేకపోయిన వార్నర్ జెర్సీని రివీల్ చేశాడు. ‘ప్లేయింగ్ కిట్ అందుకున్నాను. ఆ కిట్‌ను ఇంకా దాచి ఉంచలేను. అందుకే కిట్ ఓపెన్ చేసి నేరుగా జెర్సీని ధరించాను. రెండు రోజుల్లో ఇక్కడి నుంచి చెన్నైకి బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నాను.’ అంటూ ఇన్‌స్టాలో క్యాప్షన్ పెట్టాడు వార్నర్. వార్నర్ పోస్ట్ చేసిన వీడియోను గంటల వ్యవధిలోనే లక్ష మందికిపైగా అభిమానులు వీక్షించారు. ఇదిలాఉంటే.. ‘లుకింగ్ గుడ్’ అంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కూడా వార్నర్ వీడియోను పోస్ట్ చేసింది.
David Warner Insta Post:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ ఏప్రిల్ 9వ తేదీ నుంచి జరుగనుంది. వార్నర్ కెప్టెన్సీలో ఎస్ఆర్‌హెచ్ టీమ్ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 11వ తేదీన చెన్నైలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) తో తలపడనుంది. కాగా, చెన్నైలో జరిగిన ఐపిఎల్ 2021 వేలానికి ముందు, వార్నర్, కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్, జానీ బెయిర్‌స్టో, భువనేశ్వర్ కుమార్, మనీష్ పాండేలు ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లో ఉన్నారు. ఇక ఐపిఎల్ 2021 వేలంలో 2016 ఛాంపియన్లు(ఎస్ఆర్‌హెచ్ చాంపియన్‌గా నిలిచిన టీమ్) కేదార్ జాదవ్, ఆల్ రౌండర్ జె సుచిత్, ముజీబ్ ఉర్ రెహ్మాన్‌లను ఎస్ఆర్‌హెచ్ దక్కించుకుంది. ఇక డేవిడ్ వార్నర్ 2016 నుంచి హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వార్నర్ నేతృత్వంలోని ఎస్ఆర్‌హెచ్ టీమ్ 2020 ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కి చేరి ప్రముఖంగా నిలిచింది. ఈసారి బలైమన టీమ్‌తో ఐపీఎల్ పోరులోకి దిగుతున్న ఎస్ఆర్‌హెచ్.. కప్పు కొడుతుందా? లేదా? అనేది చూడాలి.
Also read:
Sony Xperia: సోనీ నుంచి ఎక్స్‌పీరియా సరికొత్త ఫోన్ ఈ నెలలోనే రాబోతోంది..స్పెషిఫికేషన్స్ ఇవే!
విజయ్ కోసం మాస్టర్ ప్లాన్ వేసిన పూరీ జగన్నాథ్.. ‘లైగర్’ కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్..