టీమిండియా ఎక్కడ క్రికెట్ ఆడినా ప్రేక్షకులు భారీగా తరలివస్తారు. ఇక ఆస్ట్రేలియా- ఇండియా మ్యాచ్ అంటే ఇక చెప్పనే అక్కర్లేదు.. స్టేడియంలు ప్యాక్ కావాల్సిందే.. ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య జరగబోతున్న లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్‌ల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.. మహా అయితే మరో రెండు వేల టికెట్లు మాత్రమే మిగిలి వున్నాయి.. అవి కూడా ఈజీగా అమ్ముడవుతాయి.. ఈ మ్యాచ్‌ల కోసం రెండు రోజులుగా టికెట్లను అమ్ముతోంది క్రికెట్ ఆస్ట్రేలియా.. సిడ్నీలో జరిగే మూడు టీ-20 మ్యాచ్‌లకు, కాన్‌బెర్రాలో జరిగే మూడు వన్డే మ్యాచ్‌లకు టికెట్లు అమ్మకానికి పెట్టారు.. నిజానికి స్టేడియంలు హౌజ్‌ఫుల్ అయ్యేవే! కాకపోతే కోవిడ్-19 నిబంధనలను అనుసరించి 50 శాతం టికెట్లను మాత్రమే అమ్మకానికి వచ్చారు. ఈ సిరీస్‌తో క్రికెట్ ఆస్ట్రేలియాకు మాత్రం బోలెడంత లాభం వస్తోంది.. ఇదిలా ఉంటే మొదటి టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న అడిలైడ్ నగరంలో కరోనా పరిస్థితులు నెమ్మదిగా కుదుటపడుతున్నాయి.. కేసులు ఎక్కువమవుతున్నాయని అధికారులు మొన్నటి నుంచి లాక్‌డౌన్ విధించారు. దీంతో మొదటి టెస్ట్ మ్యాచ్ అడిలైడ్‌లో జరుగుతుందా? వెన్యూ మారుతుందా? లేక వాయదా పడుతుందా ? అన్న అనుమానాలు కలిగాయి.. అయితే తప్పుడు సమాచారంతో లాక్‌డౌన్ విధించామని, త్వరలోనే లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తామని అధికారులు చెప్పడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు..అనుకున్న టైమ్‌కే అడిలైడ్‌లోనే మొదటి టెస్ట్ జరుగుతుంది..