ICC Awards Nomination: మరోసారి మారుమోగుతున్న టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ పేరు.. ఎందుకంటే..

|

Feb 03, 2021 | 3:35 AM

ICC Awards Nomination: టీమిండియా క్రికెటర్ రిషప్ పంత్ ఐసీసీ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో..

ICC Awards Nomination: మరోసారి మారుమోగుతున్న టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ పేరు.. ఎందుకంటే..
Follow us on

ICC Awards Nomination: టీమిండియా క్రికెటర్ రిషప్ పంత్ ఐసీసీ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇటు కీపర్‌గా, అటు బ్యాట్స్‌మెన్‌గా అద్భుతంగా రాణించిన రిషబ్ పంత్.. ఐసీసీ తొలి ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు ఎంపికయ్యాడు. అయితే పంత్‌తో పాటు మరో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు కూడా ఈ వార్డుకు ఎంపికయ్యారు. విజేతను వచ్చే 8వ తేదీన ప్రకటించనున్నారు. ఐసీసీసీ తొలిసారి ‘ప్లేయర్ ఆఫ్‌ ది మంత్’ అవార్డును ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ స్థాయిలో మూడు ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లకు(పురుషులు, మహిళలు) ప్రతి నెలా ఈ అవార్డును అందించనున్నారు. అయితే ఈ అవార్డు విజేతను ప్రతి నెలా రెండవ సోమవారం నాడు ప్రకటిస్తారు. కాగా, తొలి ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు నామినేట్ అయిన పంత్.. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఒక మ్యాచ్‌లో 97 పరుగులు, మరో మ్యాచ్‌లో 89 పరుగులు చేసి జట్టు విజయం కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ అవార్డుకు ఎంపికైన ప్లేయర్ల లిస్ట్‌ను ఐసీసీ ఆన్‌లైన్ ఓటింగ్‌కు ఉంచింది. ఐసీసీ కమిటీ, ఆన్‌లైన్ ఓటింగ్ ఆధారంగా విజేతలకు అవార్డును అందజేస్తారు. ఇదిలాఉంటే.. మహిళా క్రికెటర్లలో పాకిస్తాన్ ప్లేయర్ డయానా బేగ్‌ను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు ఎంపిక చేయగా.. దక్షిణాఫ్రికాకు చెందిన మరిజన్నె కాప్, షబ్నం ఇస్మాయిల్‌ కూడా నామినేట్ అయ్యారు. వీరి పేర్లను కూడా ఐసీసీ ఆన్‌లైన్ ఓటింగ్‌కు ఉంచనుంది.

Also read:

మంచి తరుణం మించిన దొరకదు..! వెండి, బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమా.!

Blood Pressure: ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.. రక్తపోటును అదుపులో ఉంచుకోండి.. ఆరోగ్యాన్ని పదిలం చేసుకోండి..