Asia Cup Hockey: కీలక మ్యాచ్‌లో అదరగొట్టిన ఇండియన్‌ హాకీ ప్లేయర్లు.. ఇండోనేషియాపై ఘన విజయం..

|

May 26, 2022 | 10:59 PM

Asia Cup Hockey: ఆసియా కప్‌ హాకీలో భారత్‌ కీలక మ్యాచ్‌లో విజయం సాధించింది. టోర్నీలో కొనసాగలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇండియన్‌ ప్లేయర్స్‌ రాణించారు. పూల్‌-ఏలో భాగంగా ఇండోనేషియాతో...

Asia Cup Hockey: కీలక మ్యాచ్‌లో అదరగొట్టిన ఇండియన్‌ హాకీ ప్లేయర్లు.. ఇండోనేషియాపై ఘన విజయం..
Asia Cup Hockey
Follow us on

Asia Cup Hockey: ఆసియా కప్‌ హాకీలో భారత్‌ కీలక మ్యాచ్‌లో విజయం సాధించింది. టోర్నీలో కొనసాగలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇండియన్‌ ప్లేయర్స్‌ రాణించారు. పూల్‌-ఏలో భాగంగా ఇండోనేషియాతో జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఏకంగా 16-0తో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు. దీంతో భారత హాకీ పురుషుల జట్టు సూపర్-4కు అర్హత సాధించింది. నాకౌట్‌ దశకు చేరాలంటే ఈ మ్యాచ్‌లో భారత్‌ కచ్చితంగా 15 గోల్స్‌ తేడాతో గెలవాల్సి ఉండగా ఏకంగా 16 గోల్స్‌ తేడాతో జయకేతనాన్ని ఎగరేసి అద్భుతం సృష్టించింది.

ఇదిలా ఉంటే భారత్‌ కంటే ముందు భారత్ కంటే ముందు జపాన్, మలేసియా, దక్షిణకొరియా సూపర్ 4 రౌండ్‌లోకి అడుగుపెట్టాయి. ఇండియా తరఫున డిస్పన్‌ టిర్కీ 5 గోల్స్‌ చేయగా.. సుదేవ్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌తో చెలరేగాడు. సెల్వం, పవన్‌, ఎస్‌వీ సునీల్‌లు కీలక సమయాల్లో గోల్స్‌తో మెరిసి భారత్‌కు విజయం అందించారు. ఇదిలా ఉంటే పూల్‌ ఏలో పాకిస్తాన్‌, ఇండియాకు చెరో నాలుగు పాయింట్లు ఉన్నాయి.

దీంతో మెరుగైన గోల్స్‌ కలిగివున్న జట్టే తర్వాత రౌండ్‌కు చేరుతుందనే నిబంధన ఉంటుంది. దీంతో భారత్‌ 16 గోల్స్‌ తేడాతే అద్భుతాన్ని సృష్టించి పాక్‌ను వెనక్కి నెట్టి రౌండ్‌4లోకి దూసుకుపోయింది. పురుషుల ఆసియా హాకీ కప్‌ చరిత్రలో అతిపెద్ద విజయం ఇదే కావడం విశేషం.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..