అంతర్జాతీయ క్రికెట్‌కు ఆమ్లా గుడ్‌ బై!

|

Aug 09, 2019 | 12:44 AM

దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ దిగ్గజం హషీం ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.  వన్డేల్లో వేగంగా 7వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈరోజు నుంచి తన రిటైర్మెంట్‌ అమలులోకి వస్తుందని స్పష్టం చేసిన ఈ ఓపెనర్.. ఐపీఎల్‌ లాంటి ప్రైవేట్ టీ20 లీగ్స్‌లో మాత్రం కొనసాగుతానని వెల్లడించాడు. భారత్‌తో ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా 2004లో జరిగిన టెస్టు సిరీస్‌తో దక్షిణాఫ్రికా జట్టులోకి అరంగేట్రం చేసిన […]

అంతర్జాతీయ క్రికెట్‌కు ఆమ్లా గుడ్‌ బై!
Follow us on

దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ దిగ్గజం హషీం ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.  వన్డేల్లో వేగంగా 7వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈరోజు నుంచి తన రిటైర్మెంట్‌ అమలులోకి వస్తుందని స్పష్టం చేసిన ఈ ఓపెనర్.. ఐపీఎల్‌ లాంటి ప్రైవేట్ టీ20 లీగ్స్‌లో మాత్రం కొనసాగుతానని వెల్లడించాడు.

భారత్‌తో ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా 2004లో జరిగిన టెస్టు సిరీస్‌తో దక్షిణాఫ్రికా జట్టులోకి అరంగేట్రం చేసిన హసీమ్ ఆమ్లా.. అనతికాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా గుర్తింపు పొందాడు. టీ20‌ల రాకతో క్రికెటర్లు సరికొత్త షాట్లతో ప్రయోగాలు చేసినా.. సంప్రదాయ క్రికెట్‌‌ షాట్లకి సుదీర్ఘకాలంగా హసీమ్ ఆమ్లా ఊపిరి పోస్తూ వచ్చాడు.

కెరీర్‌లో 124 టెస్టు మ్యాచ్‌లాడిన హసీమ్ ఆమ్లా.. 46.41 సగటుతో 9,282 పరుగులు చేశాడు. ఇందులో 28 శతకాలు ఉండగా.. నాలుగు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా ప్రస్తుతం కొనసాగుతున్న ఆమ్లా.. 181 వన్డేలాడిన 8,113 పరుగులు చేశాడు. ఇందులో 27 శతకాలు ఉన్నాయి. ఆఖరిగా 44 టీ20ల్లో 8 అర్ధశతకాలు సాధించి 1277 పరుగులు చేశాడు.దక్షిణాఫ్రికా తరఫున ట్రిపుల్‌ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా హషీం ఆమ్లా రికార్డు సృష్టించాడు.