ఫుల్ జోష్ లో మెన్ ఇన్ బ్లూ

|

Aug 09, 2019 | 7:33 PM

వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న కోహ్లీ సేన కరేబియన్ లో సరదాగా గడుపుతోంది. ఆటలు ఆడుతూ, చిందులేస్తూ ఫుల్ జోష్ లో ఉంది. విండీస్ తో జరిగిన తొలి వన్డేలో స్టెప్పులేసి అభిమానులను అలరించాడు విరాట్. తాజాగా రోహిత్ శర్మ ఛాలెంజ్ ను సవాల్ గా తీసుకున్న రవీంద్ర జడేజా..కోహ్లీ, జస్ ప్రీత్ బుమ్రాలను ఇమిటేట్ చేస్తూ నవ్వుల పువ్వులు పూయించాడు. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా..మూడు మ్యాచ్ ల టీ ట్వంటీని క్లీన్ స్వీప్ […]

ఫుల్ జోష్ లో మెన్ ఇన్ బ్లూ
Follow us on

వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న కోహ్లీ సేన కరేబియన్ లో సరదాగా గడుపుతోంది. ఆటలు ఆడుతూ, చిందులేస్తూ ఫుల్ జోష్ లో ఉంది. విండీస్ తో జరిగిన తొలి వన్డేలో స్టెప్పులేసి అభిమానులను అలరించాడు విరాట్. తాజాగా రోహిత్ శర్మ ఛాలెంజ్ ను సవాల్ గా తీసుకున్న రవీంద్ర జడేజా..కోహ్లీ, జస్ ప్రీత్ బుమ్రాలను ఇమిటేట్ చేస్తూ నవ్వుల పువ్వులు పూయించాడు.

వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా..మూడు మ్యాచ్ ల టీ ట్వంటీని క్లీన్ స్వీప్ చేసింది. ఆతిథ్య జట్టును వైట్ వాష్ చేసేసింది. దీంతో గెలుపోత్సాహంలో ఉన్న మెన్ ఇన్ బ్లూ ఎంజాయ్ చేస్తోంది.  తనను అనుకరిస్తున్న రవీంద్ర జడేజాను చూసి విరాట్ కోహ్లీ నవ్వడంతో ఒక్కసారిగా అందరూ నవ్వేశారు. బీసీసీఐ  పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. లైకుల మీద లైకులొస్తున్నాయి.

వెస్టిండీస్ అంతటా వర్షాలు పడుతుండటంతో ఫస్ట్ వన్డే వర్షార్పణమైంది. రెండవ టీ ట్వంటీకి వరుణుడు అడ్డు రావడంతో డక్వర్త్ లూయిస్ విధానంలో భారత్ విజయం సాధించింది.  ఇక ఈ నెల 12న జరగనున్న సెకండ్ వన్డేలో వెస్టిండీస్ తో తలపడనుంది టీమిండియా. వన్డే సిరీస్ తర్వాత రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది.