
Yuzvendra Chahal Alcohol Addiction: టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. భార్యతో విడాకుల తర్వాత రీఎంట్రీ చాలా ప్రయత్నాలు చేసినా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. ఈక్రమంలో విడాకుల తర్వాత తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలపై తొలిసారి నోరు విప్పాడు. భార్యతో విడాకుల తర్వాత మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యానని, ఆ సమయంలో మద్యానికి బానిసనయ్యానంటూ చెప్పుకొచ్చాడు. అయితే, తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్కు ఈ అలవాటు అడ్డంకిగా మారుతుందని గుర్తించి, వెంటనే రిహాబ్ సెంటర్ను ఆశ్రయించినట్లు చాహల్ పేర్కొన్నాడు.
ఆకాశ్ చోప్రాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చాహల్ తన గత అనుభవాలను పంచుకున్నాడు. చిన్న వయసులోనే మద్యం అలవాటు మొదలైందని చెప్పిన ఆయన.. విడాకుల తర్వాత పరిస్థితి మరింత అదుపు తప్పిందని వెల్లడించాడు. వ్యక్తిగత సమస్యలు, సమాజం నుంచి వచ్చిన ఒత్తిడి తనపై ప్రభావం చూపాయని తెలిపాడు.
ఆ సమయంలో మానసికంగా కుంగిపోయానని చాహల్ పేర్కొన్నారు. మద్యం తన జీవితంపై ప్రభావం చూపుతున్న విషయాన్ని క్రమంగా గుర్తించినట్లు చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా క్రికెట్కు దూరమయ్యే పరిస్థితి వస్తుందనే ఆలోచన తనను ఆలోచించేలా చేసిందని వివరించాడు.
తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ను ఈ వ్యసనం కారణంగా కోల్పోయే అవకాశం ఉందని గ్రహించిన వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నట్లు చాహల్ తెలిపాడు. రిహాబ్ సెంటర్ను ఆశ్రయించి మద్యపాన వ్యసనం నుంచి బయటపడేందుకు ప్రయత్నించానని, చివరకు దాని నుంచి బయటపడగలిగానని వెల్లడించాడు.
చాహల్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. వ్యక్తిగత జీవితంలో ఎదురైన కఠిన పరిస్థితులను ఎదుర్కొని తిరిగి తన క్రికెట్పై దృష్టి పెట్టిన విధానాన్ని ఆయన ఈ ఇంటర్వ్యూలో వివరించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..